సీఎం చంద్రబాబు బర్త్‌డే స్పెషల్

అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం

అక్షర ఆయుధం : పటమట అన్న క్యాంటీన్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన జన్మదినం సందర్భంగా అల్పాహారం తీసుకున్నారు. అల్ఫాహారం తీసుకున్న తర్వాత ప్రభుత్వ పథకాల అమలు ఎలా ఉన్నాయంటూ స్థానికులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆటో డ్రైవర్ సేవలో, ఉచిత బస్సు, తల్లికి వందనం, ఇతర పథకాలను గురించి ఆరా తీశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సోమవారం తన జన్మదిన వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నారు. పేదలు, కార్మికులు, ప్రజల మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తన 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని సతీమణి నారా భువనేశ్వరితో కలిసి సోమవారం ఉదయం 9.30 గంటలకు విజయవాడ నగరంలోని పటమట అన్నక్యాంటీన్‌కు వెళ్లారు.అక్కడ సిబ్బంది సీఎం చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు అల్పాహారాన్ని వడ్డించారు.ఈ సందర్భంగా పలువురు సీఎం చంద్రబాబు నాయుడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.అన్న క్యాంటీన్ వద్ద అల్పాహారం స్వీకరించిన సీఎం చంద్రబాబు దంపతులు పటమట అన్న క్యాంటీన్ వద్ద అందరికీ అల్పాహారం వడ్డించిన సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు అనంతరం 10 రూపాయలు ఇచ్చి రెండు టోకెన్లు తీసుకోబోయారు. అయితే అన్న క్యాంటీన్ సిబ్బంది ఈరోజు ఫ్రీ అని చెప్పి ఉచితంగా అల్పాహారం ఇచ్చారు. దీంతో సీఎం చంద్రబాబు నాయుడు, భార్య నారా భువేశ్వరిలు ఇద్దరూ పేదలు, కార్మికులు, ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించారు. ఇకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటన్లకు ఒకరోజు ఖర్చు రూ.76 లక్షలు నారా భువనేశ్వరి విరాళంగా అందజేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచితంగా అన్న ప్రసాద వితరణ చేపట్టిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పథకాలపై సీఎం చంద్రబాబు ఆరా అల్ఫాహారం తీసుకున్న తర్వాత ప్రభుత్వ పథకాల అమలు ఎలా ఉన్నాయంటూ స్థానికులను అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆటో డ్రైవర్ సేవలో, ఉచిత బస్సు, తల్లికి వందనం, ఇతర పథకాలను గురించి ఆరా తీశారు. మైనారిటీలకు కూటమి ప్రభుత్వంలో గుర్తింపు లభిస్తోందని ఓ ముస్లిం మహిళ తెలిపారు. ఓ ఆటో డ్రైవర్ కుటుంబ వివరాలను సీఎం అడిగితెలుసుకున్నారు.తన చిన్న కుమారుడుకి చదువు అబ్బలేదని, తనతో పాటు ఆటో వృత్తిలో కొనుసాగుతున్నాడని ఆటో డ్రైవర్ చెప్పాడు. చదువు అబ్బకపోవటం కాదు… నువ్వు నచ్చ చెప్పలేకపోయావని సరదాగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.రూ.5కే కడుపునిండా భోజనం ‘అన్న క్యాంటీన్ కు వచ్చి తమతో కలిసి అల్ఫాహారం తీసుకోవడం చాలా సంతోషాన్నించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులకు లబ్ధిదారులు తెలియజేశారు.ఈ సందర్భంగా అన్న క్యాంటీన్‌లో భోజనం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. రూ.5లకే కడుపునిండా పెడుతున్నారని, ఇదే ఆహారం బయట తీసుకోవాలంటే రూ.వంద ఖర్చు అవుతుందని లబ్ధిదారులు తెలియజేశారు. ‘క్యాంటీన్ రోజూ శుభ్రంగా ఉంటుందా, నేను వచ్చానని చేశారా అని సీఎం ఆరా తీశారు.‘తాము రోజూ ఇక్కడికే వస్తామని, ఎప్పుడూ పరిశుభ్రంగా, తాజా ఆహారాన్ని అందిస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులు తెలిపారు.అన్న క్యాంటీన్లు అమ్మను తలపిస్తున్నాయి: భువనేశ్వరి రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు అన్నం పెట్టే అమ్మను తలపిస్తున్నాయని నారా భువనేశ్వరి అన్నారు. అన్న క్యాంటీన్ల సేవలు ఎంతో మన్నన పొందాయని…లక్షల మంది పేదల కడుపు నింపే మహోన్నత కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం దీన్ని నిర్వహించడం గొప్ప విషయం అని భువనేశ్వరి అభిప్రాయ పడ్డారు. రూ.5లకే పరిశుభ్ర వాతావరణంలో ప్రభుత్వం గౌరవంగా పేదలకు భోజనం అందిస్తోందని అమె అన్నారు. ఏప్రిల్ 20వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టిన రోజు సందర్భంగా నారా భువనేశ్వరి రూ.76 లక్షలు విరాళంగా అందించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదినం అయిన ఏప్రిల్ 20న రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో పూర్తి ఉచితంగా భోజనం అందించాలని భువనేశ్వరి కోరారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పేదలకు కడపు నింపే అన్న క్యాంటీన్లకు విరాళం ఇవ్వడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని భువనేశ్వరి అన్నారు. అత్యంత పరిశుభ్రమైన వాతారణంలో అన్న క్యాంటీన్లలో పౌష్టికాహారం అందించడం గొప్ప విషయం అని ఆమె అభిప్రాయ పడ్డారు. రోజువారీ కూలీలు, పేదలు ఈ పథకం ద్వారా ఎంతో లబ్ది పొందుతున్నారని…ఇలాంటి కార్యక్రమాలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు. ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని భువనేశ్వరి అన్నారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం ఎంతో సంతృప్తి:భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు ఆర్థికంగా చేయూతనిచ్చి స్ఫూర్తి నింపేందుకు అంతా ముందుకు రావాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే సంతృప్తి ఏముంటుదని వ్యాఖ్యానించిన భువనేశ్వరి….తాను పలు సందర్భాల్లో అన్న వితరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కలిగిన సంతృప్తిని, ప్రజల స్పందనను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. తమ మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా 12 ఏళ్లుగా ప్రతీ ఏటా తిరుమలలో అన్న ప్రసాదానికి రూ.44 లక్షలు విరాళంగా ఇస్తున్న విషయాన్ని ఆమె ప్రస్థావించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నారా భువనేశ్వరి….అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఈ ఏడాది మీ పుట్టిన రోజుకు మేమిచ్చే బహుమానం అంటూ వ్యాఖ్యానించారు. తన పేరు మీద అన్న క్యాంటీన్లకు ఒక రోజు అన్నదానానికి రూ.76 లక్షల విరాళం ఇచ్చిన తన సతీమణి భువనేశ్వరిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. అన్నదాన కార్యక్రమం గొప్ప కార్యక్రమం: సీఎం చంద్రబాబు ‘రాష్ట్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ఒక గొప్ప కార్యక్రమంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. తిరుమలలో భక్తుల సహకారంతో 4 దశాబ్దాలుగా అన్నదానం జరుగుతోంది. అలాగే ప్రముఖ దేవాలయాల్లోనూ అన్నదానం నిర్వహిస్తున్నాం. పేదలకు రూ.5 లకే కడుపునింపే అన్న క్యాంటీన్ సేవలను మరింత విస్తరించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘నాణ్యతను పాటించడంతో పాటు..పవిత్రంగా, గౌరవంగా, పరిశుభ్రంగా ఆహారం అందించే ఈ కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వాలి. పుట్టిన రోజు, పెళ్లి రోజు సహా తమకు నచ్చిన రోజు భోజనాలకు అయ్యే ఖర్చును విరాళంగా ఇచ్చేందుకు ప్రజలు ముందుకు రావాలి. ఇదొక స్ఫూర్తి దాయకమైన కార్యక్రమంగా మారి బ్రాండ్ ను సృష్టించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *