పయనించే సూర్యుడు న్యూస్ : ‘డీఎంకే తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలు నష్ట పోయారు… దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయి. దేశంలో సగం జనాభా మహిళలే. ఈ విషయాన్ని ఇండి కూటమి పార్టీలు ఎందుకు గుర్తించటం లేదు..?’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగాలని డీఎంకే కోరుకుంటోందా..? మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని డీఎంకే కోరుతోందా…?’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ‘మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవటం ద్వారా కాంగ్రెస్ నేతృత్వంలోని డీఎంకే మహిళలకు ద్రోహం చేసింది. గతంలో ప్రోగ్రెసివ్ రాష్ట్రంగా ఉన్న తమిళనాడు ఇప్పుడు ఆర్ధికంగా వెనుకపడింది. తమిళనాడులో చాలా కుంభకోణాలు చోటు చేసుకున్నాయి’అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూరులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు డీఎంకే, కాంగ్రెస్ పార్టీతో సహా ఇండి కూటమిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిలలతు, డీలిమిటేషన్ బిల్లులను వ్యతిరేకించడంపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రంగా మండిపడ్డారు డీ లిమిటేషన్ బిల్లు వల్ల నష్టపోము ‘మహిళా రిజర్వేషన్ బిల్లును ఎందుకు వ్యతిరేకించిందో డీఎంకే సమాధానం చెప్పాలి. దక్షిణాది రాష్ట్రాలకు రావాల్సిన వాటాను రాకుండా డీఎంకే అడ్డుకుంది. 50 శాతం సీట్లు పెరుగుతాయని స్పష్టంగా చెబుతుంటే ఇబ్బంది ఏమిటి..?’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.‘మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం చాలా కాలంగా నాలాంటి వ్యక్తులు పోరాడుతున్నారు. 2029 ఎన్నికలకే ఈ రిజర్వేషన్ అమలు కావాలని ప్రధాని మోడీ భావించారు. కేంద్రం ప్రతిపాదించిన డిలిమిటేషన్ బిల్లు వల్ల తమిళనాడు, ఏపీ, కేరళ, తెలంగాణ, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు సీట్లు పెరిగి ఉండేవి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయి డీఎంకే తీసుకున్న నిర్ణయం వల్ల మహిళలు నష్ట పోయారు… దక్షిణాది రాష్ట్రాలు నష్టపోయాయి. దేశంలో సగం జనాభా మహిళలే. ఈ విషయాన్ని ఇండి కూటమి పార్టీలు ఎందుకు గుర్తించటం లేదు..?’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ‘మహిళా బిల్లు వీగిపోయేలా చేసిన ఇండి కూటమి ఎన్డీఏ ఓడించలేదు… మహిళలను ఓడించింది. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగాలని డీఎంకే కోరుకుంటోందా..? మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదని డీఎంకే కోరుతోందా…?’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. మహిళలను డీఎంకే నిరాశపరిచింది ‘2027 సెన్సెస్ ప్రకారం చేస్తే దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయి. రిజర్వేషన్ల కోసం ఎదురు చూస్తున్న మహిళల్ని డీఎంకే వంటి పార్టీలు నిరాశ పరిచాయి. కాంగ్రెస్ – డీఎంకే రాజకీయాల కారణంగా మహిళలు ఓడిపోయారు’అని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.మంచి ఉద్దేశ్యంతో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బిల్లులను తెస్తే… రాజకీయాల కోసం కాంగ్రెస్, డీఎంకే వాటిని వీగిపోయేలా చేశాయంటూ సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘తమిళనాడుకు నీరు ఇచ్చేలా తెలుగు గంగ ప్రాజెక్టును గతంలో చేపట్టాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్గతంగా నదుల అనుసంధానం చేపడుతున్నాం. గంగా- కావేరీ అనుసంధానం జరిగితే దేశానికే నీటి కొరత తీరుతుంది. ప్రతీ ప్రభుత్వం జవాబుదారీతనంతో పారదర్శక విధానాలను అవలంభించాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.