సాక్షి డిజిటల్ న్యూస్: ‘2023 ఎన్నికల్లో ఓడించా. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జీరోను చేశాం. పంచాయతీ ఎన్నికల్లో ఓడించాం.మున్సిపల్ ఎన్నికల్లో పాతరేశాం.జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఘోరి కట్టాం’ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘోరి కట్టి ఆ ఘోరీపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పోవాలి. పాపాల భైరవుడు రావాలి అని ఒక పెద్దమనిషి అంటున్నారని ఫామ్‌హౌస్‌లో పడుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు రావాలి? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 40 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి కుటుంబానికి పదవులు కట్టబెట్టింది అని అయితే ఏడాదిపాటు పదవి లేకపోతే జీవన్ రెడ్డి కార్యకర్తల గుండెల మీద తన్ని శత్రువు పంచన చేరారు అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రతిపక్ష హోదా ఊడగొడతానని ఊడగొట్టకపోతే తన పేరు మార్చుకుంటా అని రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఇదే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సవాల్ అని చెప్పుకొచ్చారు. 2029లో నువ్వో నేనో తేల్చుకుందాం అని ఛాలెంజ్ విసిరారు. బీఆర్ఎస్ ఘోరిపై కాంగ్రెస్ జెండా ఎగురేస్తాం ‘2023 ఎన్నికల్లో ఓడించా. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో జీరోను చేశాం. పంచాయతీ ఎన్నికల్లో ఓడించాం.మున్సిపల్ ఎన్నికల్లో పాతరేశాం.జూబ్లీహిల్స్, కంటోన్మెంట్ ఎన్నికల్లో ఘోరి కట్టాం’ సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నిల్లో బీఆర్ఎస్ పార్టీకి ఘోరి కట్టి ఆ ఘోరీపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడిస్తాం అని ధీమా వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నాటి పీసీసీ చీఫ్ డీ శ్రీనివాస్ నేతృత్వంలో కాంగ్రెస్ ఎలా అయితే అధికారంలోకి వచ్చిందో రాబోయే రోజుల్లో తాను, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పుకొచ్చారు. 2034 ఎన్నికల వరకు కాంగ్రెస్ అధికారంలో ఉండం ఖాయమని. ఇక బీఆర్ఎస్ సర్ధుకోవాల్సిందే అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతు భరోసా నిధులు విడుదల అంతకుముందు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండం నస్తూర్‌పల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రెండో విడత రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. రైతులకు వ్యవసాయ పెట్టుబడి సాయంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి 40 లక్షల రైతు ఖాతాల్లోకి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస్తూర్‌పల్లి గ్రామంలో నిర్వహించిన రైతు ఉత్సవాల్లో పాల్గొన్నారు. తొలుత గ్రామంలో రైతులతో కలిసి రైతు ఉత్సవ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభ వేదికగా కంప్యూటర్‌పై బటన్ నొక్కి రైతు భరోసా నిధులను విడుదల చేశారు. ఈరోజు రూ. 2,200 కోట్ల నిధులను విడుదల చేయగా, ఇప్పటివరకు రైతు భరోసా కింద రూ. 5,700 కోట్లు విడుదల చేసినట్టు చెప్పారు. వచ్చే నెలలో మరో రూ.3,300 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. ఈ దేశానికి రైతులే వెన్నెముక ‘ఈ దేశానికి వెన్నెముక రైతులే. రైతులను ఆదుకుని వారిని నిటారుగా నిలబెట్టే బాధ్యత ప్రభుత్వం తీసుకుంది. రైతు సంక్షేమమే మా విధానం’అని రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.‘రూ. 2 లక్షల మేరకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చి, అధికారం చేపట్టిన ఏడాదిలోపే 25.35 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశాం. గతసారి కేవలం 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. వ్యవసాయం దండగ కాదు పండుగ కావాలన్నదే మా సంకల్పం. రైతుల కళ్లల్లో ఆనందం చూడాలన్నదే మా లక్ష్యం. అందుకే సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం’ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దేశంలోనే రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన తొలిపార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. ఈ రైతు ఉత్సవాల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ధనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , వివేక్ వెంకటస్వామితో పాటు ప్రభుత్వ విప్‌లు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.