జనం న్యూస్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ పోస్ట్ మెట్రిక్ చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్ తెలిపింది. పోస్ట్‌మెట్రిక్ విద్యార్థుల స్కాలర్షిప్ కింద ఎస్సీ విద్యార్థులకు బోధనా రుసుములు మెయింటెనెన్స్ చార్జీలను విడుదల చేసింది. రూ.374 కోట్ల నిధులు మంజూరు చేసింది. 83239 మంది ఎస్సీ విద్యార్థులకు లబ్ధి పొందారు. తెలంగాణలోని పోస్ట్‌మెట్రిక్ విద్యార్థులుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీపికబురు చెప్పాయి. పోస్ట్‌మెట్రిక్ విద్యార్థుల స్కాలర్షిప్స్ కింద ఎస్సీ విద్యార్థులకు బోధనా రుసుములు (ట్యూషన్ ఫీజు) మరియు మెయింటెనెన్స్ చార్జీలను 2024-25 సంవత్సరం నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో చెల్లిస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ సంవత్సరంలో ఇప్పటికి రూ. 374.00 కోట్ల నిధులు, రాష్ట్రంలోని వివిధ కళాశాలలకు చెందిన 83239 మంది ఎస్సీ విద్యార్థుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడమైనది. ఇందులో రాష్ట్రప్రభుత్వం తన వాటా కింద రూ.173.00 కోట్లు విడుదల చేయగా కేంద్రప్రభుత్వం రూ. 201.00 కోట్లు విడుదల చేసింది. ప్రభుత్వానికి విద్యార్థుల థ్యాంక్స్. ఇకపోతే విద్యార్థులు తమకు చెందిన మెయింటెనెన్స్ అమౌంట్‌ను మినహాయించుకుని, బోధానా రుసుమును (ట్యూషన్ ఫీజు) ఇతరేతర రుసుములను కళాశాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఉపకారవేతన నిధులు జమ చేయబడిన విద్యార్థుల వివరాలు సంబంధిత కళాశాల ప్రిన్సిపల్స్ యొక్క ఈ-పాస్ లాగిన్స్ లో పొందుపరచడం కూడా జరిగింది అని ఎస్సీ అభివృద్ధి శాఖ కమిషనర్ తెలిపారు. ఈ నిధులను విడుదల చేసిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకి ఉపకారవేతనాలు పొందిన విద్యార్థులు ధన్యవాదాలు తెలియజేశారు.అలాగే ఈ నిధుల కోసం కృషి చేసిన ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కి ఎస్సీ విద్యార్థులందరూ మనస్పూర్తిగా తమ కృతజ్ఞతలు తెలియజేశారు.