అక్షర ఆయుధం వైసీపీ నేత పూడి శ్రీహరికి బెయిల్ మంజూరైంది. ఈ సందర్భంగా పూడి శ్రీహరి మాట్లాడారు. ‘నేను అభియోగాలు ఎదుర్కొంటున్న పోస్టింగ్ తయారీలో కానీ, దాన్ని ఇతరులకు పంపించడంలో కానీ, నేను పోస్ట్ చేయడం కానీ చేయలేదు. ఎప్పుడూ జర్నలిస్ట్ పరిధిలోనే పనిచేశాను. చట్టాన్ని గౌరవించే వారు దాన్ని రక్షించాలనే భావజాలం ఉన్న మనుషుల్లో నేను కూడా ఒకడిని’అని పూడి శ్రీహరి వెల్లడించారు. సోషల్ మీడియా పోస్టు కేసులో పోలీసులు తనపై మోపిన అభియోగాలకూ, తనకూ ఎలాంటి సంబంధం లేదని…తాను పోస్టు తయారు చేయడం కానీ, పోస్టు చేయడం కానీ, ఫార్వార్డ్ చేయడం కానీ చేయలేదని వైసీపీ ప్రధాన కార్యదర్శి (మీడియా) పూడి శ్రీహరి స్పష్టం చేశారు. ఇవాళ కుప్పం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి (లీగల్) పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ కేజేఆర్ భరత్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పాతికేళ్లకు పైగా జర్నలిస్టుగా పనిచేసిన తాను ఎప్పుడూ చట్ట పరిధిలోనే పనిచేశానని…ఇకపైనా అలాగే పనిచేస్తానని పూడి శ్రీహరి తెలిపారు. చట్ట పరిధిలోనే పనిచేస్తా, వ్యక్తిత్వ హననం చేయొద్దు‘రాష్ట్రంలో కొన్ని పత్రికలు, ప్రసార మాధ్యమాల ద్వారా నా వ్యక్తిత్వ హననం చేసే ప్రక్రియ జరుగుతున్నందున ఓ క్లారిటీ ఇవ్వదల్చుకున్నాను. నా మీద మోపిన అభియోగాలకూ, నాకూ ఎలాంటి సంబంధం లేదు. దాదాపు 26 ఏళ్లుగా సీనియర్ జర్నలిస్టుగా ఉన్నాను. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో చాలా మంది పెద్దలతో కలిసి పనిచేసే అవకాశం నాకు దక్కింది. వివిధ పత్రికలు, ఛానళ్లలో ఎడిటర్లు, సీనియర్ జర్నలిస్టుల తరహానే పాత్రికేయ పరిధికి లోబడే నేను పనిచేస్తాను తప్ప పరిధి దాటి ఎప్పుడూ పని చేయలేదు’అని పూడి శ్రీహరి వెల్లడించారు. ‘నా మీద ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేదు. ఈ మధ్య కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి పోలీసులు అడిగిన వివరణ ఇచ్చాను. ఇవాళ కూడా ఈ కేసుకు సంబంధించి వివరాలు అడిగితే చెప్పాను. పోలీసులు అడిగిన సమాచారం ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలియజేశాను. నేను అభియోగాలు ఎదుర్కొంటున్న పోస్టింగ్ తయారీలో కానీ, దాన్ని ఇతరులకు పంపించడంలో కానీ, నేను పోస్ట్ చేయడం కానీ చేయలేదు. ఎప్పుడూ జర్నలిస్ట్ పరిధిలోనే పనిచేశాను. చట్టాన్ని గౌరవించే వారు దాన్ని రక్షించాలనే భావజాలం ఉన్న మనుషుల్లో నేను కూడా ఒకడిని. కాబట్టి ఈ కేసు దర్యాప్తుకు సహకరిస్తానని పోలీసులకు, కోర్టుకు కూడా చెప్పాను’అని పూడి శ్రీహరి వెల్లడించారు. ‘నేను పార్టీ నాయకుడిగా ఉన్నప్పటికీ చేస్తున్నది మాత్రం జర్నలిస్టు పనే. వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన నా లాంటి వారిని ఎక్కడో ఒక చోట, దశాబ్దానికి ఒకసారో జగన్మోహన్ రెడ్డి వంటి నాయకులు మా మాలాంటి వారిని గుర్తించి పైకి లాగుతునప్పుడు ఇలా వేధింపులకు గురి చేయడం ఇబ్బందికరంగా అనిపించింది’అని పూడి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు.‘