సీఎం చంద్రబాబుకు బర్త్‌డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ ఇతర నేతలు

సాక్షి డిజిటల్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే పలువురు ప్రముఖులు సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పలువురు కేంద్ర మంత్రులు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం వైఎస్ జగన్, సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ తదితరులు చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. చంద్రబాబుకు బర్త్ డే విషెస్ తెలిపిన మోదీ. ఆయన హార్డ్ వర్కింగ్ సీఎం అని, తనకు మంచి మిత్రుడని పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్న ముఖ్యమంత్రి, నా మంచి స్నేహితుడు అయిన చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ ప్రగతి పథంలో కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఆయన ప్రజల సేవలో దీర్ఘాయుష్షుతో జీవించాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని ప్రధానమంత్రి మోదీ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు చంద్రబాబుకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షిస్తున్నట్టుగా తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ అవిశ్రాంత అంకితభావం ఆంధ్రప్రదేశ్‌ను పురోగతి, నూతన ఆవిష్కరణల మార్గంలో నడిపిస్తూనే ఉంది. మీరు మంచి ఆరోగ్యంతో మరెన్నో సంవత్సరాలు ప్రజా సేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను – కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భగవాన్ తిరుపతి బాలాజీ మీకు మంచి ఆరోగ్యాన్ని, దీర్ఘాయువును, సుసంపన్నమైన జీవితాన్ని ప్రసాదించాలి – ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు తన విజన్ తో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకొన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దటం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న చంద్రబాబు పాలనలో ఆంధ్ర ప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలుస్తుంది. చంద్రబాబు నాయుడుకు సంపూర్ణ ఆయురారోగ్యాలను. సంతోషాన్ని అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను – ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన కల్యాణ్. >> ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఒక గొప్ప నాయకుడిగా అందరికీ స్ఫూర్తినిచ్చే మిమ్మల్ని ‘నాన్న’ అని పిలుచుకునే అదృష్టం నాకు దక్కింది. ఏడాది గడుస్తున్న కొద్దీ ప్రజా సేవ పట్ల మీకున్న తపన మరింత పెరుగుతోంది. మీ దశాబ్దాల అనుభవం, జ్ఞానం ఇప్పుడు సరికొత్త ఉత్సాహంతో తోడై రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నాయి. ప్రతిరోజూ మీ నుండి నేర్చుకునే అవకాశం లభించినందుకు నేను అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను. మీ ఆలోచనా స్పష్టత, దృఢత్వం, ప్రజల పట్ల అచంచలమైన నిబద్ధత నాకు మార్గదర్శకంగా నిలుస్తూనే ఉన్నాయి. మీరు నిరంతరం మంచి ఆరోగ్యం, బలం కలిగి ఉండాలని, మరెన్నో సంవత్సరాలు స్ఫూర్తిదాయకమైన నాయకత్వం వహించాలని ఆకాంక్షిస్తున్నాను

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *