జనం న్యూస్ : మాజీ మంత్రి మల్లా రెడ్డి కోడలు ప్రీతిరెడ్డి… బీజేపీలోకి చేరనున్నారా? అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. అయితే తాజాగా ఆ వార్తలను ప్రీతి రెడ్డి ఖండించారు. తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదని చెప్పాలి. అయితే మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. అయితే ప్రీతిరెడ్డి… బీజేపీలోకి చేరనున్నారా? అనే చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇందుకు గత కొద్ది రోజులుగా ప్రీతిరెడ్డి అనుసరిస్తున్న వైఖరే ఇందుకు కారణం. ప్రీతిరెడ్డి గత కొంతకాలంగా ప్రతీ రెడ్డి… ప్రధాని మోదీపై, కేంద్ర ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. బీజేపీ పార్టీ విధానాలపై సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఇటీవల మల్లారెడ్డితో పాటు ప్రీతిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం కలిసివచ్చారు. దీంతో మల్లారెడ్డి కుటుంబ సభ్యులు బీజేపీలో చేరతారా? అనే చర్చ మొదలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ప్రీతిరెడ్డి… తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావుతో కూడా భేటీ అయ్యారు. ఇక, తాజాగా నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన ప్రీతిరెడ్డి… పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారిని కలిశారు. దీంతో ప్రీతి రెడ్డి బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే ప్రీతిరెడ్డి మాత్రమే బీజేపీలో చేరతారా?, ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి కూడా కాషాయ గూటికి చేరతారా? అనే చర్చలు కూడా సాగుతున్నాయి. అయితే ఈ ప్రచారంపై ప్రీతి రెడ్డి స్పందించారు. తాను, మల్లారెడ్డి బీజేపీలో చేరడం లేదని తెలిపారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో ఏఐ క్యాంపస్ ఓపెనింగ్‌కు ప్రధాని మోదీని ఆహ్వానించామని చెప్పారు. ప్రధాని మోదీని ఆహ్వానించాం కాబట్టే ఆ పార్టీ నేతలను ఇప్పుడు కలుస్తున్నామని తెలిపారు. బీజేపీనే కాదని, ఇతర పార్టీల నేతలను కలిసి ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఇటీవల తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబును కూడా కలిసి ఆహ్వానించామని తెలిపారు. తమకు బీఆర్‌ఎస్ అంటే గౌరవం ఉందని తెలిపారు. విద్యావేత్తగా తాను అన్ని పార్టీల వాళ్లని కలుస్తుంటానని చెప్పారు. తాము బీజేపీలో చేరతామనే ప్రచారాన్ని ఆపాలని కోరారు.