మహిళా సాధికారతపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.

5 లక్షల పారిశ్రామికవేత్తల తయారీ లక్ష్యం

సాక్షి డిజిటల్ న్యూస్ : మహిళా సాధికారత దిశగా ఆంధ్రప్రదేశ్ మరో కీలక అడుగు వేస్తోంది అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తల లక్ష్యాన్ని ప్రభుత్వం అధిగమించింది. ఈ ఏడాది 5 లక్షలమంది పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దేలా నయా నిర్దేశం చేశారు. రూ.50 కోట్ల ఉచిత ప్రయాణాలు స్త్రీ శక్తి స్కీం మైలురాయిని చేరుకుంది. అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఏర్పాట్లు చేశారు. మహిళలకు కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమం-అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా ఉమెన్స్ డే నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాజధానిలోని అమరావతి పరేడ్ గ్రౌండ్స్ లో జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజరుకానున్నారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. వివిధ రంగాల్లో సక్సెస్ అయిన మహిళలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.20 నెలల కూటమి పాలనలో మహిళా సంక్షేమం, అభివృద్ధి, సాధికారతను వివరించేలా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. మహిళలు, చిన్నారుల భద్రత మొదలుకుని వారి ఆర్థిక స్వావలంభన వరకు చాలా కార్యక్రమాలను అమలు చేసింది. రాష్ట్రంలో కీలకమైన పథకాల్లో మహిళలను భాగస్వాములను చేసింది…మహిళలకే ప్రాధాన్యత ఇచ్చింది. సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందనం, స్త్రీ శక్తి వంటి పథకాలు మహిళ కోసం రూపొందించినవే. రాష్ట్ర ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేస్తే… ఆ పథకాల అమల్లో స్త్రీ శక్తి పథకం సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటివరకు 50 కోట్ల ఉచిత ప్రయాణాల మైలు రాయిని ఈ పథకం చేరుకుంది. సంక్షేమంలోనే కాదు… అభివృద్ధిలోనూ మహిళలకు భాగస్వామ్యం మహిళలకు వివిధ సంక్షేమ పథకాలు అందించడంతోపాటు… రాష్ట్రాభివృద్ధిలోనూ కూటమి ప్రభుత్వం మహిళలను కీలక భాగస్వాములుగా చేసింది. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అతి కీలక నిర్ణయాల్లో వన్ ఫ్యామ్లీ-వన్ ఎంటర్ ప్రెన్యూయర్ విధానం ప్రధానంగా ఉంది. ఈ విధానంలోనూ మహిళలకు పెద్ద పీట వేసింది కూటమి ప్రభుత్వం. లక్ష మంది మహిళలను పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దాలని గత మహిళా దినోత్సవం నాడు రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఏడాది గడిచే సరికి లక్ష మంది మహిళా పారిశ్రామిక వేత్తల లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు తాజాగా మరో 5 లక్షల మంది మహిళా పారిశ్రామిక వేత్తలను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోనుంది. ఇవే అంశాలను సీఎం చంద్రబాబు సభలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడే డ్వాక్రా సంఘాల ఏర్పాటుతో మహిళల్లో సాధికారత తెచ్చిన ముఖ్యమంత్రి… ఇప్పుడు డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయి బ్రాండింగ్ కల్పించేలా గత కొంత కాలంగా కసరత్తు చేస్తున్నారు. దీంట్లో భాగంగా డ్వాక్రా ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్వయం పేరుతో బ్రాండింగ్ చేయాలని నిర్ణయించారు. అలాగే స్వయం లోగోను తీర్చిదిద్దారు. స్వయం బ్రాండ్ పేరు, లోగోలను ముఖ్యమంత్రి మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్నారు. కార్యక్రమం జరిగేదిలా… ఆదివారం ఉదయం 11:30 గంటలకు అమరావతి పరేడ్ గ్రౌండ్స్ చేరుకుని..ముఖ్యమంత్రి సుమారు నాలుగు గంటల పాటు జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జ్వోతి ప్రజ్వలన, మా తెలుగుతల్లి గీతాలాపనతో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ప్రారంభం కానుంది. ప్రత్యేక వీడియోలతో పాటు, లక్ష మంది మహిళా పారిశ్రామికవేత్తల సాధించిన విజయాలు, భవిష్యత్ లక్ష్యాలపై రూపొందించిన ప్రజెంటేషన్లను సీఎం చంద్రబాబు వీక్షిస్తారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్కులను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. కీలకోపన్యాసం అనంతరం వివిధ శాఖలకు చెందిన స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. చిరుధాన్యాల బండ్లు, ఎగ్ కార్ట్స్, ఫామ్ బజార్ వ్యాన్లు వంటి వాటిని లబ్దిదారులకు పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు సమక్షంలో 36 ఎంవోయూలపై ఉన్నతాధికారులు సంతకాలు చేయనున్నారు. ఈ క్రమంలో 5 కొత్త పథకాలను ప్రారంభించి,7 అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన ఫలకలను సీఎం చంద్రబాబు ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత 50 మంది మహిళా పారిశ్రామికవేత్తలు, ఆర్‌టిసి మహిళా డ్రైవర్లు సహా వివిధ రంగాల్లో సక్కెస్ అయిన మహిళా ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి హోం మంత్రి అనిత, మహిళా సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *