శ్రీహరికోటకు విక్రం-1 ఆర్బిటల్ రాకెట్‌.

*జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్

సాక్షి డిజిటల్ న్యూస్ : ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రం-1 ఆర్బిటల్ రాకెట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రముఖ ఎరోస్పేస్ సంస్థ స్కైరూట్ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన విక్రం-1 ఆర్బిటల్ రాకెట్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి అంతరిక్షం పేరుతో స్కైరూట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి… మంత్రి శ్రీధర్ బాబు, స్కైరూట్ సంస్థ ప్రతినిధుల సమక్షంలో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఉన్న ప్రయోగశాలకు తరలించే విక్రం-1 రాకెట్‌ను జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ మామిడిపల్లిలోని జీఎంఆర్ ఏరోస్పేస్ – ఇండస్ట్రియల్ పార్క్‌లో నెలకొల్పిన స్కైరూట్‌కు చెందిన మాక్స్-క్యూ డిజైన్ ఫెసిలిటీలో విక్రం-1 రాకెట్‌ను రూపొందించారు. దేశ అంతరిక్ష పరిశోధనలో ప్రైవేటు రంగంలో రూపొందించి అభివృద్ధి చేసిన మొట్టమొదటి రాకెట్ ఇదే కావడం గమనార్హం. సీఎం రేవంత్ రెడ్డి… స్కైరూట్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై విక్రం-1 ఆర్బిటల్ రాకెట్ వివరాలను తెలుసుకుని వారితో మాట్లాడారు. అనంతరం స్కైరూట్ ఫెసిలిటీ సెంటర్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్కైరూట్ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… ఏరోస్పేస్ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవాలన్న తెలంగాణ లక్ష్య సాధనలో ఇదొక కీలక మైలురాయిగా నిలుస్తుందని అన్నారు. ఈ రాకెట్‌ను పూర్తిగా హైదరాబాద్‌లోనే రూపొందించి, అభివృద్ధి చేయడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ‘‘ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు భారతదేశపు మొట్టమొదటి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్‌ను స్కైరూట్ అభివృద్ధి చేసింది. సంస్థ 2022లో తన తొలి రాకెట్‌ను ప్రయోగించగా, ఇంత తక్కువ సమయం లోనే ఆర్బిటల్ ప్రయోగ దశకు చేరుకోవడం ఒక అద్భుతమైన విజయం. ఏరోస్పేస్ రంగంలో దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, బోయింగ్, ఎయిర్‌బస్, సాఫ్రాన్ వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇప్పటికే తెలంగాణలో ఉన్నాయి. ఏరోస్పేస్‌ను కీలక వృద్ధి రంగంగా పరిగణిస్తూ 2047 నాటికి ఈ రంగంలో ప్రపంచ అగ్రగామిగా నిలవడమే తెలంగాణ లక్ష్యం’’ అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 2023 డిసెంబర్ నుంచి ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ అసాధారణ ప్రతిభ కనబరిచిందని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2023-24, 2024-25 మధ్య ఇంజనీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణ 117.9 శాతం అత్యధిక వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. ఈ వృద్ధికి విమాన విడిభాగాలు, రక్షణ పరికరాలు ప్రధానంగా దోహదపడ్డాయని చెప్పారు. ప్రపంచ విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక దిగ్గజాలతో భాగస్వామ్యాల ద్వారా ఏరోస్పేస్ రంగం కోసం యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పటిష్టమైన విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రతిభ, చైతన్యవంతమైన పర్యావరణ వ్యవస్థతో స్కైరూట్ వంటి కంపెనీలకు మద్దతు ఇవ్వడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రతిభావంతులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు, త్వరలో ఆధునీకరించనున్న పాలిటెక్నిక్ కళాశాలల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ నైపుణ్య శిక్షణా కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. పాఠ్యప్రణాళిక పరిశ్రమల ఆధారితంగా, అన్ని కోర్సులలో ఏకరూపంగా ఉండేలా చూసేందుకు ఏటీసీలు, పాలిటెక్నిక్ కళాశాలలు రెండింటినీ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుందని పేర్కొన్నారు. ఇక, హైదరాబాద్‌లోని మల్లేపల్లిలో ఉన్న ఏటీసీని సందర్శించా ల్సిందిగా స్కైరూట్ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనపై స్కైరూట్ ఏరోస్పేస్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు పవన్ కుమార్ చందన స్పందిస్తూ… యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో కలిసి పనిచేయడానికి ఆసక్తితో ఉన్నట్టు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *