ఏపీలో పెట్రోల్‌ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు

అక్షర ఆయుధం ; ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల డీజిల్ కొరత నెలకొంది. దీంతో పెట్రోల్ బంక్‌ల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. అయితే ఈ పరిస్థితులపై సీఎం చంద్రబాబు నాయుడు శనివారం సమీక్ష నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల డీజిల్ కొరత నెలకొంది. దీంతో పెట్రోల్ బంక్‌ల ముందు నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. గత వారం రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో డీజిల్ కొరత నెలకొంది. అయితే నిన్నటి నుంచి చాలా పెట్రోల్ బంక్‌లలో డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. డీజిల్ కొరత నేపథ్యంలో పెట్రోల్ కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని ప్రచారం తెరమీదకు వచ్చింది. దీంతో పెట్రోల్ వాహనదారులు అవసరానికి మించి ఇంధనం నింపుకుంటున్నారు. బాటిళ్లలో పెట్రోల్ పట్టుకుని తీసుకెళ్లారు. దీంతో పలు చోట్ల పెట్రోల్ కొరత కూడా ఏర్పడింది. దీంతో రాష్ట్రంలోని చాలా చోట్ల పెట్రోల్ బంక్‌ల ఎదుట నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఆక్వా రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఏరియేటర్ల నిర్వహణకు డీజిల్‌ దొరకడం లేదని వాపోతున్నారు. అయితే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఇంధన సరఫరాను తగ్గించడంతో బంకుల్లో డీజిల్‌ కొరత ఏర్పడిందని చెబుతున్నారు. దీంతో డీజిల్ ట్యాంకులు బంక్‌లకు చేరుకోగానే, వాహనదారులు అక్కడికి చేరుకుని క్యూలు కడుతున్నారు. అయితే ఈ పరిస్థితిపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై అధికారుల వద్ద నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి…ఇంధన కొరతతో ఏపీలో పలు చోట్ల పెట్రోల్‌ బంకుల మూసివేతపై అధికారులతో సీఎం చంద్రబాబు శనివారం రోజున సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, వాహనదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై అధికారులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఇంధన సరఫరాపై పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌తో ఫోన్‌లో చర్చలు జరిపారు. తక్షణం స్టాక్‌లేని బంకుల వివరాలు అందించాలని ఆదేశించారు. స్టాక్‌సమస్య ఉంటే తక్షణం టోల్‌ఫ్రీ నంబర్‌ 1967కు కాల్‌ చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కోరారు. దీంతో రాష్ట్ర డీలర్ల అసోసియేషన్… క్షేత్రస్థాయిలో సమాచారం సేకరిస్తుంది. ఆయిల్ కంపెనీల సరఫరా తీరుపై పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు క్షేత్రస్థాయి నివేదిక సమర్పించనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *