జనం న్యూస్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. చంద్రబాబును మామయ్య అని ఆత్మీయంగా సంబోధిస్తూ ఆయన పట్ల ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. చంద్రబాబు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు పాటు ఆనందంగా ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు ప్రముఖులు,సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా పలువురు చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. దీంతో ఎక్స్‌లో #HBDOneAndOnlyCBN హ్యాష్ ట్యాగ్ మొదటి స్థానంలో ట్రెండింగ్ అవుతుంది. తాజాగా యంగటైగర్ జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా సీఎం చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మావయ్య అని సంబోధిస్తూ తన ఆత్మీయతను మరోసారి చాటుకున్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు నారా, నందమూరి అభిమానుల్లో జోష్ నింపింది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. చంద్రబాబుకు జూ.ఎన్టీఆర్ బర్త్ డే శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా బర్త్ డే విషెస్ తెలియజేశారు.సీఎం చంద్రబాబును ‘మావయ్య’ అని ఆత్మీయంగా సంబోధిస్తూ ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఎన్టీఆర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు నందమూరి, ఇటు నారా అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది. సీఎం చంద్రబాబు నాయుడు ఎల్లప్పుడూ ఆయురా రోగ్యాలతో, నిండు నూరేళ్ల పాటు సుఖసంతోషాలతో ఉండాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన చూపే అంకితభావం, పట్టుదల ఇలాగే కొనసాగాలని, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఆయనకు చేకూరాలని తారక్ కోరుకున్నారు. ఒక దార్శనికత కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయకత్వం రాష్ట్రానికి ఎంతో అవసరమని తన సందేశంలో జూ.ఎన్టీఆర్ పేర్కొన్నారు.ముఖ్యంగా చంద్రబాబు నాయకత్వం రాష్ట్ర ప్రజల్లో గర్వాన్ని, అభివృద్ధిని నింపాలని ఎన్టీఆర్ అభిలషించారు. ప్రతీ ఏడాది శుభాకాంక్షలు తెలియజేస్తున్న తారక్ ఇకపోతే ఎన్టీఆర్ తన మావయ్య చంద్రబాబు నాయుడుకు ప్రతీ ఏడాది పుట్టినరోజున శుభాకాంక్షలు చెప్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా చంద్రబాబుకు బర్త్ డే విషెశ్ చెప్తూనే ఉన్నారు.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు , కూటమి భారీ విజయం సాధించినప్పుడు ఎన్టీఆర్ అత్యంత ఉత్సాహంగా అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రూమర్స్‌కు ఒక్క ట్వీట్‌తో చెక్కుపెట్టిన తారక్ ఇదిలా ఉంటే గత కొంతకాలంగా ఇరువురి కుటుంబ సభ్యుల మధ్య రాజకీయ, కుటుంబ పరమైన సంబంధాల గురించి పలు కథనాలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు అభిమానులు సైతం విభిన్నంగా స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో జూనియర్ ఎన్టీఆర్ స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు చెప్పడంతో ఇప్పుడు ఆ రూమర్స్ కు తెరపడిందని చెప్పవచ్చు. డ్రాగన్ మూవీలో నటిస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఇకపోతే తారక్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వసంత్ నటిస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ గతంలో ఎన్నడు చూడని విధంగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఏకంగా 20 కేజీల వరకు ఎన్టీఆర్ బరువు తగ్గినట్లు తెలుస్తోంది.మరోవైపు త్వరలోనే దేవర 2 సినిమా కూడా తెరకెక్కే అవకాశాలు ఉన్నట్లు సినీ పరిశ్రమలో టాక్ ఉంది.