జనం న్యూస్ : ఎన్డీఏకు వేసే ఓటుతో తమిళనాడు రాష్ట్రం గెలుస్తుంది. ప్రతీ ఇల్లూ, ప్రతీ వ్యక్తీ గెలుస్తారు’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అభివృద్ధి, ఉద్యోగాలు కావాలంటే కేంద్ర సహకారం అవసరం అని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు.తమిళనాడుకు తిరిగి పూర్వ వైభవం రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ గెలవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తమిళనాడుకు తిరిగి పూర్వ వైభవం రావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ గెలవాలి.ఏపీలో గత పాలకులు విధ్వంసం చేస్తే 22 నెలల్లో విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం.ఎన్డీఏకు వేసే ఓటుతో తమిళనాడు రాష్ట్రం గెలుస్తుంది. ప్రతీ ఇల్లూ, ప్రతీ వ్యక్తీ గెలుస్తారు’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. తమిళనాడులో ఏన్డీఏ అభ్యర్థుల తరఫున సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంనిర్వహిస్తున్నారు.ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులకు ఓట్లేయాలని కోరుతున్నారు.కృష్ణగిరి జిల్లా తళి నియోజకవర్గంలో ఎన్డీఏ అభ్యర్థి నాగేష్ కుమార్ ను గెలిపించాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తళి నుంచి తిరుపతికి బస్ వేయాలని స్థానికులు సీఎం చంద్రబాబు నాయుడును కోరగా అందుకు అంగీకరించారు. తమిళనాడుకు వస్తే నా సొంతగడ్డకు వచ్చినట్లే ఉంది ‘ఆంధ్రప్రదేశ్ చూపిస్తున్న ఆదరణ, అభిమానం తమిళనాడులోనూ చూపిస్తున్నారు. తమిళనాడుకు వచ్చినా నాకు సొంత గడ్డపై ఉన్నట్టే ఉంది. తమిళ సంస్కృతిపై ఎన్నో దాడులు జరిగినా ప్రాచీన వారసత్వాన్ని కాపాడుకున్న ప్రాంతం ఇది. ఎంతో మంది ప్రముఖులు, ఆధ్యాత్మిక ప్రాంతాలు కలిగిన తమిళనాడు రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందింది’అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ‘ఏపీలోని తిరుపతికి తమిళ భక్తులు పెద్ద ఎత్తున వస్తుంటారు. మన భాష ఏదైనా అంతా ద్రవిడులమే. ఎన్టీఆర్ సినీ జీవితం కూడా తమిళనాడు నుంచే ప్రారంభమైంది. తమిళనాడు- ఏపీ సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు నుంచే నేను వచ్చాను. చెన్నైకి తెలుగు గంగ నీళ్లు ఇచ్చిన ఘనత ఎన్టీఆర్ దే. తమిళనాడు- ఏపీ అన్నదమ్ములుగా కలిసి అభివృద్ధి చెందుతున్నాం’అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వికసిత భారత్ మోడీ లక్ష్యం ‘ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి సమర్ధ నాయకత్వం ఇస్తున్నారు. ప్రధాని మోడీ సంక్షేమం- అభివృద్ధి- సుపరిపాలనతో దేశ భవిష్యత్తును పరుగులు పెట్టిస్తున్నారు. భారత్‌ను ప్రపంచ పటంలో గౌరవమైన స్థానంలో ఉంచిన వ్యక్తి ప్రధాని మోడీనే’అని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. ‘తమిళుల ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు పట్టని పార్టీలు కొన్ని ఉన్నాయి. వికసిత్ భారత్ కోసం ప్రధాని విజన్ తయారు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించేందుకు బిల్లు తెచ్చారు. సమాజంలో మహిళలకు సమాన గౌరవం ఇచ్చేందుకు ఈ బిల్లు తెస్తే కాంగ్రెస్, డీఎంకే పార్టీలు ఆ బిల్లును వ్యతిరేకించాయి’అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే ఏం సాధించిందని విర్రవీగుతోంది? ‘ఢిల్లీని ఓడించామని డీఎంకే విర్రవీగుతోంది… మహిళా బిల్లును అడ్డుకున్న డీఎంకే పార్టీ ఏ సాధించింది..?. పెరిగిన సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే కాంగ్రెస్, డీఎంకేలకు వచ్చిన ఇబ్బందేమిటి..?’అని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ‘గతంలోనూ కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు సహకరించలేదు. క్రెడిట్ అవసరం లేదని… ప్రతిపక్షాలకే క్రెడిట్ ఇస్తున్నామని ప్రధాని నేరుగా చెప్పినా కాంగ్రెస్, డీఎంకేలు బిల్లును ఓడించాయి. నియోజకవర్గాలు 50 శాతం పెరుగుతాయని స్పష్టంగా పేర్కొన్నా ఎందుకు వ్యతిరేకించారో డీఎంకే సమాధానం చెప్పాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.