సాక్షి డిజిటల్ న్యూస్: కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. కాళేళ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటకు తీయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ మేరకు సీబీఐకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. అవసరమైతే నేరుగా సీబీఐ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఇప్పటికే విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను నియమించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ కమిటీ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కమిటీ నివేదికపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక ఆధారంగా ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించిన సంగతి తలిసిందే. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కాళేళ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని బయటకు తీయాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఈ మేరకు సీబీఐకు లేఖ రాయాలని నిర్ణయించుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరపాలని కోరుతూ సీబీఐకు లేఖ రాయాలని అవసరమైతే నేరుగా సీబీఐ డైరెక్టర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. సీబీఐకు లేఖ రాయండి: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి విచారణ కోసం న్యాయ నిపుణుల సూచనల మేరకు తక్షణమే విచారణ చేపట్టాలని కోరుతూ సీబీఐకి లేఖ రాయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అదేశించారు. అవసరమైతే ఈ విషయంలో సీబీఐ డైరెక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా వినతిపత్రం అందించాలని మంత్రులకు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటీవల హైకోర్టు తీర్పు నేపథ్యంలో తదుపరి చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీతో చర్చించి ప్రభుత్వం అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించారు. పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటును, కమిషన్ ఇచ్చిన నివేదికను హైకోర్టు తప్పు పట్టలేదని, అవన్నీ చెల్లుబాటులో ఉన్నాయని న్యాయ నిపుణులు వివరించారు. కాళేశ్వరం అంశంపై ప్రస్తుతం ఏ కోర్టులోనూ ఎలాంటి కేసు పెండింగ్‌లో లేదని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. అందువల్ల సీబీఐ విచారణ చేపట్టేందుకు చట్టపరమైన అడ్డంకులు లేవని అభిప్రాయపడ్డారు.ఈ ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సుప్రీంకోర్టు న్యాయ నిపుణులు అభిషేక్ సింఘ్వీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. రాజ్యసభ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, నీటి పారుదల శాఖ ఈఎన్సీ శ్రీధర్, సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇవే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు మరియు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలను విస్మరించారని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగిందని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది.