అక్షర ఆయుధం ; కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుందని ప్రశ్నించారు. కుటుంబంలో ఆధిపత్య పోరుతోనే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత పార్టీ ఏర్పాటు చేయడంపై స్పందించిన కోమటిరెడ్డి రాజగోపాల్… డబ్బులు ఉన్నాయని పార్టీ పెట్టడం అంటే పాన్ షాప్ పెట్టినంత సులువు అయిపోయిందని అన్నారు. కవితతో ఊదు కాలదు, పీరు లేవదు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేటీఆర్, హరీష్ రావు, కవితలకు పేరు వచ్చిందే కేసీఆర్ వల్ల అని అన్నారు. కేసీఆర్ లేకుంటే కవిత ఎక్కడుందని ప్రశ్నించారు. కుటుంబంలో ఆధిపత్య పోరుతోనే కవిత బయటకు వచ్చి పార్టీ పెట్టారని ఆరోపించారు. కవిత పార్టీ పెట్టడం ఒక జోక్ అని అన్నారు. ఆడబిడ్డకు తండ్రి అంటే చాలా ప్రేమ ఉంటుందని… అయితే పార్టీ మొదటి సమావేశంలోనే కవిత తన తండ్రి కేసీఆర్‌ను విమర్శించి మర్యాద పోగొట్టుకున్నారని అన్నారు. ఉద్యమకారుడు కేసీఆర్‌ను కవిత విమర్శించడం బాదేసిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఎవరైనా తండ్రిపై ప్రేమ ఉన్నవాళ్లు అలా మాట్లాడుతారా? అని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. కవిత పార్టీ ఏర్పాటు సమయంలో చాలా తప్పు మాట్లాడారని అన్నారు. కవితను తెలంగాణలో ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. తండ్రిని గౌరవించలేని కవిత… తెలంగాణ ప్రజలకు తల్లి ఎలా అవుతుందని ప్రశ్నించారు. కవితకు కేటీఆర్‌పై కోపం ఉండొచ్చు, అధికారం కావాలనే ఆశ ఉండొచ్చని… కానీ తండ్రిపై అలాంటి మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో కవితకు క్లీన్ చిట్ రాలేదని అన్నారు. ఆ కేసు ఇంకా కోర్టులో పెండింగ్‌లో ఉందని, ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఫస్ట్ కవిత ఆ కేసులో నుంచి బయటపడాలని విమర్శించారు. కవిత ఎంతో తెలివిగా టీఆర్ఎస్ పేరుని వాడుకుని రాజకీయ లబ్దిని పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కవిత పార్టీ సంగతి పక్కన పెడితే… ఆమె పోటీ చేసిన చోట కూడా గెలవరని అన్నారు. కవిత ఆమెకు ఉన్న మర్యాద కూడా పొగొట్టుకున్నారని విమర్శించారు. కవిత పోటీ చేస్తే కూడా డిపాజిట్ రాదని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. ఇంకా, కాంగ్రెస్ అధిష్టానం తనకు హామీ ఇచ్చిందని… తనకు మంత్రి పదవి ఇస్తే కచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.