అక్షర ఆయుధం ; ఏపీలో ఎన్డీఏ అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎన్డీఏలో ఎలాంటి గ్యాప్ రాకూడదు. కలిసికట్టుగా వ్యవహరించాలి. ఫ్లెక్సీల దగ్గరో…కుర్చీల దగ్గరో గొడవలు పెట్టుకుంటే తీవ్రంగా నష్టపోతాం. మనం నష్టపోతాం. మన పార్టీ నష్టపోతుంది’ అని సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. కార్యకర్తల నుంచి అధ్యక్షుడి వరకు క్రమశిక్షణతో పని చేయడం పార్టీ మూల సిద్దాంతం. ప్రజలతో సౌమ్యంగా ఉండాలి… అందుబాటులో ఉండాలి అని దిశానిర్దేశం చేశారు. బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ కొత్త కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరయ్యారు. పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీ సభ్యులతో ప్రమాణం చేయించారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇటీవల కాలంలో ఫ్లెక్సీలు, కుర్చీలు, ప్రోటోకాల్ విషయంలో ఎదురవుతున్న పరిణామాలు…జరుగుతున్న గొడవలపై నేతలకు గట్టిగా హెచ్చరించారు. ఇకపై ఇలానేప్రవర్తిస్తే తీవ్రంగా నష్టపోతాం అని సీఎం చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ నేను చక్కగా ఉంటున్నాం ‘నాయకులు ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. నేతలు.. కార్యకర్తలు తప్పు చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి.. నేను చాలా మనస్థాపానికి గురయ్యాను’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మనం సుపరిపాలనా యజ్ఞం చేస్తున్నాం. మన వాళ్లు కూడా సరిగా వ్యవహరించకుంటే బాధ కలుగుతుంది. నేను-పవన్ కళ్యాణ్ చక్కగా ఉంటున్నాం. మంచి రిలేషన్ కొనసాగిస్తున్నాం. రాష్ట్రానికి ఒక సందేశం ఇస్తున్నాం. ఇదే క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా వ్యవహరించాలి. బీజేపీని కలుపుకుని వెళ్లాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ‘నాయకులు ప్రజలకు-ప్రభుత్వానికి వారధిగా ఉండాలి. నేతలు.. కార్యకర్తలు తప్పు చేస్తే పార్టీకి, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి.. నేను చాలా మనస్థాపానికి గురయ్యాను’అని సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘మనం సుపరిపాలనా యజ్ఞం చేస్తున్నాం. మన వాళ్లు కూడా సరిగా వ్యవహరించకుంటే బాధ కలుగుతుంది. నేను-పవన్ కళ్యాణ్ చక్కగా ఉంటున్నాం. మంచి రిలేషన్ కొనసాగిస్తున్నాం. రాష్ట్రానికి ఒక సందేశం ఇస్తున్నాం. ఇదే క్షేత్ర స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా వ్యవహరించాలి. బీజేపీని కలుపుకుని వెళ్లాలి’అని సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. చిన్నపాటి కలహాలు కూడా రావద్దు ‘ఏపీలో ఎన్డీఏ అధికారంలో ఉంది. కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఎన్డీఏలో ఎలాంటి గ్యాప్ రాకూడదు. కలిసికట్టుగా వ్యవహరించాలి. ఫ్లెక్సీల దగ్గరో…కుర్చీల దగ్గరో గొడవలు పెట్టుకుంటే తీవ్రంగా నష్టపోతాం. మనం నష్టపోతాం. మన పార్టీ నష్టపోతుంది’ అని సీఎం చంద్రబాబు నాయుడు క్లాస్ పీకారు. ప్రధాన మంత్రి పర్యటన సందర్భంగా సెక్యూరిటీ తనను వెళ్లనీయకపోతే గొడవ చేస్తానా అని ప్రశ్నించారు.సెక్యూరిటీకి తాను తెలియకపోవచ్చు. తన డ్యూటీ తాను చేశాడు అంతే అని సరిదిద్దుకోవాలి అని సీఎం చంద్రబాబు నాయుడు హితవు పలికారు.