పయనించే సూర్యుడు న్యూస్ : యూపీఐ పేమెంట్లపై ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ అమల్లోకి రానున్నాయి. డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ కొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఖాతాదారుల నగదు భద్రత కల్పించేందుకు డిజిటల్ నేరాలపై ఉక్కుపాదం మోపేందుకు క్విల్ స్విచ్ విధానాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. అలాగే ఇకపై రూ. 10వేలకు పైగా పేమెంట్లుచేస్తే గంట వరకు వేచి చూసేలా కొత్త నిబంధనలను తీసుకురానుంది. దేశవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలు విపరీతంగా పెరిగాయి. డిజిటల్ లావాదేవీలు పెరగడం…ప్రతీ దానికి డిజిటల్ చెల్లింపుల ప్రక్రియ గణనీయంగా పెరగడంత అంతేస్తాయిలో డిజిటల్ మోసాలు సైతం పెరిగాయి.ఈ డిజిటల్ మోసాలకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు, ఆన్లైన్ పేమెంట్స్‌లో భద్రతను పెంచడానికి ఆర్బీఐ నాలుగు అంచెల రక్షణ వ్యవస్థను ప్రతిపాదించింది. ఈ మేరకు భారత రిజర్వ్ బ్యాంక్ కొన్ని సరికొత్త ప్రతిపాదనలను ముందుకు తీసుకువచ్చింది. గంట దాటాకే చెల్లింపులు, కిల్ స్విచ్ వంటి ప్రతిపాదనలను ఆర్బీఐ తీసుకువచ్చింది. ఈ మేరకు ఆర్బీఐ ఓ చర్చా పత్రాన్ని విడుదల చేసింది.ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాతనే ఈ 5 ప్రతిపాదనలను అమలు చేయాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. గంట తర్వాతే లావాదేవీలు ఆర్బీఐ ప్రతిపాదన ప్రకారం ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి రూ. 10,000 పైబడిన లావాదేవీలను గంట సేపు నిలిపివేయనున్నారు. ఒక వ్యక్తి అకౌంట్ నుంచి రూ.10వేలు వేరొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేస్తే అవతలి వ్యక్తి అకౌంట్లోకి ఆ నగదు చేరేందుకు గంట సమయం పడుతుంది. ఈ గ్యాప్‌లో మీ నగదు మోసగాడి ఖాతాలోకి వెళ్తున్నట్లు అనుమనం వస్తే ఆ లావాదేవీని రద్దు చేసే అవకాశం ఖాతాదారుడికి ఉంటుంది. ఆన్లైన్ మోసాల్లో భారీ డిజిటల్ పేమెంట్లను ఎక్కువ సమయం హోల్డ్ చేయనుంది. కిల్ స్విచ్ విధానంతో రైతులకు లబ్ధి ఖాతాదారుడు తన ఖాతాలో ఏదైనా అనుమానాస్పద, అనధికార లావాదేవీలు జరిగిందని అనుమానం వస్తే వెంటనే అతడి డిజిటల్ లావాదేవీలను నిలిపివేసేలా ఒక క్విల్ స్విచ్ ఆప్షన్‌ను కూడా బ్యాంకులు అందుబాటలోకి తీసుకురావాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఈ క్విల్ స్విచ్‌ను ఆప్షన్‌ను ఆర్బీఐ ప్రతిపాదించింది. దీంతో యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ, కార్డు లావాదేవీలన్నీ అక్కడికక్కడే నిలిచిపోతాయి. ఈ కిల్ స్విచ్ వల్ల ఖాతాదారుడు లబ్ధిపొందనున్నాడు. మ్యూల్ ఖాతాలపై నిఘా దేశంలో డిజిటల్ పేమెంట్ల మోసాలకు పాల్పడే వారు మ్యూల్ ఖాతాలను వినియోగిస్తుంటారు. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు తమ ఆచూకీ పోలీసులకు దొరకకుండా మ్యూల్ ఖాతాలను(వేరేవాళ్ల ఖాతాలను)వినియోగిస్తుంటారు. ఈ క్రమంలో మోసపూరిత ఖాతాలను గుర్తించేందుకు, సరైన ధృవీకరణ లేని ఖాతాల్లో వార్షిక క్రెడిట్ పరిమితిని రూ.25 లక్షలకు పరిమితం చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. వృద్ధులకు ప్రత్యేక భద్రత వృద్ధులు , దివ్యాంగులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలను అరికట్టడానికి RBI మరో కీలక ప్రతిపాదన తీసుకువచ్చింది. యూజర్ల కోసం ప్రత్యేక ప్రొటెక్షన్ అందించాలని ఆర్బీఐ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రతిపాదన ప్రకారం 70 ఏళ్లు పైబడిన వారు లేదా దివ్యాంగులు రూ. 50,000 కంటే ఎక్కువ డబ్బు పంపాలనుకుంటే, వారి నమ్మకస్తులైన వ్యక్తి నుంచి అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల పెద్ద మొత్తంలో డబ్బులు పోకుండా రక్షణ లభిస్తుంది. అలాగే అనుమానాస్పదంగా కనిపించే ఖాతాలకు ఏడాదికి ఇంతే డబ్బు క్రెడిట్ అవ్వాలనే పరిమితిని కూడా ఆర్బీఐ విధించనుంది. రూ.25లక్షలు దాటిన లావాదేవీలపై తనిఖీలు సైబర్ నేరగాళ్లు తమ ఆచూకీ ఫేక్ కాల్ సెంటర్లు, మ్యూల్ అకౌంట్లు, డీప్‌ఫేక్‌ల వంటి కొత్త విధానాలు వాడుతుంటారు. ఇలాంటి మోసాలను నివారించేందుకు ఆర్బీఐ రూ.10వేలు దాటిన లావాదేవీల సమయం గంట ఆలస్యం చేయాలని ఆర్బీఐ ప్రతిపాదించింది. అయితే షాపింగ్ మాల్స్‌లో లేదా ఆన్లైన్ పోర్టల్స్‌లో వస్తువులు కొన్నప్పుడు చేసే మర్చంట్ పేమెంట్స్‌కు ఈ నిబంధన వర్తించదు.ఈ కొత్త రూల్ యూపీఐ పేమెంట్లకు కూడా వర్తిస్తుంది అని ఆర్బీఐ పేర్కొంది.దీనివల్ల నిత్యావసర కొనుగోళ్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. తద్వారా వినియోగదారులు తమ లావాదేవీలను ఈ గ్యాప్‌లోనే నిలిపివేయవచ్చు. అయితే ఇది బిజినెస్ పేమెంట్లకు వర్తించదు అని ఆర్బీఐ పేర్కొంది. ఒకవేళ సైబర్ మోసం జరుగుతోందని మీకు అనుమానం రాగానే, వెంటనే మీ డిజిటల్ పేమెంట్స్ అన్నింటినీ నిలిపివేసేలా ఒక‘కిల్ స్విచ్’ఆప్షన్‌ను కూడా బ్యాంకులు అందుబాటులోకి తేవాలని ఆర్బీఐ సూచిస్తోంది. అటు రూ. 25 లక్షలు దాటిన లావాదేవీలపై అదనపు తనిఖీలు ఉంటాయి అని ఆర్బీఐ పేర్కొంది. ప్రజల అభిప్రాయమే ముఖ్యం ఈ 5 ప్రతిపాదనలపై భారత రిజర్వ్ బ్యాంక్ ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ కోరింది. కొన్ని ఖాతాలపై పరిమితులు విధించాలని, అవసరమైతే అన్ని డిజిటల్ పేమెంట్లను తక్షణమే నిలిపివేసేందుకు ‘కిల్ స్విచ్’ ఫీచర్‌ను ప్రవేశపెట్టాలని ఆర్బీఐ భావిస్తోంది. ఈ విషయంపై మే 8వ తేదీలోగా సూచనలు ఇవ్వాలని ఆర్బీఐ ప్రజలను కోరింది.అందరి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తర్వాతనే అధికారికంగా నిబంధనలను అమలులోకి తెస్తుంది. ఆన్లైన్ మోసాల వల్ల సామాన్యుడు నష్టపోకుండా ఇలాంటి కఠినమైన నిర్ణయాలు తప్పవని పలువురు బిజినెస్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీతో పాటు భద్రత కూడా పెరిగితేనే డిజిటల్ ఇండియా మరింత బలోపేతం అవుతుంది అని అభిప్రాయపడుతున్నారు.