కాలేజీ విద్య రీ-ఓరియేంటేషన్ అవసరం: సీఎం చంద్రబాబు నాయుడు

* కాలేజీ విద్యలో రిఫార్మ్స్: రీ-ఓరియేంటేషన్, కరికుల్యం రీ-స్ట్రక్చర్‌పై సీఎం ఫోకస్

* విద్యలో మార్పే మార్గం-కొత్త దిశగా సీఎం పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్ : కాలేజీ విద్యపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలేజీ విద్యను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలి అని సూచించారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ విద్యను రీ ఓరియంటేషన్ చేయాల్సి ఉంది అని ఈ మేరకు అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే కరికుల్యంను రీ స్ట్రక్చర్ చేసేలా చూడాలి అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పథకాలు.. కార్యక్రమాలను పక్కా ప్రణాళికలతో అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంతోపాటు…సంతృప్తి కలిగించే రీతిలో సేవలు అందించినప్పుడే మంచి ఫలితాలు వస్తాయన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకునే విషయంలో ఎలాంటి జాప్యమూ జరగకూడదని ముఖ్యమంత్రి ఆదేశించారు. మంగళవారం ఆర్టీజీస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ఈ ఏడాదిలో మరోసారి సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నాం. ఆ దిశగా గృహ నిర్మాణ శాఖ వేగంగా పనిచేయలి. టిడ్కో ఇళ్లు కాకుండానే మరో 5 లక్షలకు ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలి. ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసే విషయంలో ఎక్కడా ఆలస్యం కాకూడదు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇళ్ల నిర్మాణం చేపడుతున్నాం.. లబ్దిదారుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇది కొనసాగాలి. ఇళ్ల నిర్మాణంతోపాటు… ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. సుమారు 2 లక్షల మంది ఇళ్ల స్థలాలు కోరినట్టు సర్వేలో తేలింది. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇళ్ల నిర్మాణాన్ని ఎంత వేగంగా చేపడుతున్నారో.. ఇళ్ల స్థలాల పంపిణీని కూడా అదే స్థాయిలో చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేయాలి. ఇక వర్షాకాలంలో ఇసుక సరఫరాలో ఇబ్బందులు రాకుండా ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు ఇసుకను ఉచితంగా ఇస్తున్నాం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని వదులుకుంటున్నాం. రీచుల వద్ద, స్టాక్ యార్డుల వద్ద రవాణ పేరుతో కానీ… ఇతర పేర్లతో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. దీనిపై పటిష్ట నిఘా పెట్టాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. కాలేజ్ కరిక్యులంను రీ-స్ట్రక్చర్ చేయాలి ‘కాలేజీ విద్యను మరింత పటిష్టంగా తీర్చిదిద్దాలి. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కాలేజీ విద్యను రీ-ఓరియేంటేషన్ చేయాల్సి ఉంది. ఈ మేరకు అధ్యయనం చేయండి. యూనివర్శిటీలతో నిత్యం అనుసంధానం చేసుకోవాలి. ట్రెడిషన్ కోర్సులతో పాటు… డిమాండ్ ఉన్న కోర్సులను, కొత్త కరిక్యులంను ప్రవేశపెట్టేలా కసరత్తు చేయాలి. ఈ మేరకు కరికుల్యంను రీ-స్ట్రక్చర్ చేసేలా చూడాలి’. అలాగే యూనివర్శిటీల ర్యాంకింగులు కూడా మరింతగా పెరగాల్సి ఉంది. విశాఖలోని ఆంధ్రా యూనివర్శిటీతోపాటు… మిగిలిన యూనివర్శిటీలు కూడా ర్యాంకింగులను మరింతగా పెంచుకోవాల్సి ఉంది. ఇదే సందర్భంగా హయ్యర్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్ కూడా మరింత యాక్టివ్‌గా ఉండాలి. ఈ మేరకు విద్యా శాఖ అధికారులు కృషి చేయాలి. మధ్యాహ్న భోజన పథకం విషయంలో ఎలాంటి ఫిర్యాదులు కానీ… విమర్శలు కానీ రాకూడదు. శాప్ విభాగం తన యాక్టివిటీని మరింత పెంచుకోవాలి. 5కే రన్ వంటి కార్యక్రమాలు చేపట్టాలి. ప్రజల్లో, యువతలో ఆరోగ్య రక్షణ పట్ల అవగాహన కల్పించేలా శాప్ చర్యలు చేపట్టేలా శాప్ చర్యలు తీసుకోవాలి. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలి. ప్రజల్లో అవగాహన కల్పించాలి. ట్రిపుల్ రైడింగ్ వల్ల ఎక్కువ ప్రమాదాలు.. మరణాలు జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని నివారించాలి. కఠినంగా నిబంధనలు అమలు చేయడానికంటే ముందు… ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. హెల్మెట్ వల్ల ప్రమాదాల నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలి. ట్రాఫిక్ నిబంధనలు తమ కోసమేననేది ప్రజలు అర్థం చేసుకునేలా అవగాహన కల్పించాలి. విద్యుత్, కేబుల్ తీగలు కిందకు వేలాడుతున్న కారణంగా అగ్ని ప్రమాదాలు జరిగి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటివి ఇకపై జరగడానికి వీళ్లేదు’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పిడుగుపాటుపై మరింత అప్రమత్తత అవసరం ‘పిడుగు పాటుకు ప్రజల ప్రాణాలు పోకూడదనే ముందస్తుగా అలెర్ట్ మెసేజ్‌లు పంపిస్తున్నాం…అయినా అక్కడక్కడా మరణాలు సంభవిస్తున్నాయి. టెక్నాలజీని వినియోగిస్తున్నాం… కానీ ప్రజల్లో దానిపై అవగాహన కలిగించేలా చేయకుంటే ఏం ఉపయోగం…? ఫోన్లల్లో మెసేజీలు పెట్టడమే కాదు… క్షేత్ర స్థాయిలో ఉన్న సిబ్బందినీ అలెర్ట్ చేయాలి. అలాగే ఫలానా టవర్ లోకేషన్ పరిధిలో పిడుగులు పడే ప్రమాదం ఉందని నెట్ వర్క్ ద్వారా ప్రజలకు తెలియచేసేలా చూడాలి’ అని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సమీక్ష అనంతరం ఆర్టీజీఎస్ రూపొందించిన అవేర్ 2.0 మొబైల్ యాప్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సమీక్ష సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *