టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు తీపికబురు

సహజ మరణానికీ 10 లక్షల ఇన్సూరెన్స్

అక్షర ఆయుధం : ఉద్యోగుల భద్రత విషయంలో టీజీఎస్ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు టీజీఎస్ఆర్టీసీలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన ఉద్యోగులకు ఉచితంగా రూ.10 లక్షలు బీమా అందించాలని నిర్ణయించింది. తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీపి కబురు అందించింది. తమ బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను మరింత పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం ప్రమాదవశాత్తూ జరిగే మరణాలకు మాత్రమే వర్తిస్తున్న బీమా సౌకర్యాన్ని, ఇప్పుడు సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి చేసిన ప్రత్యేక సూచనల మేరకు యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ద్వారా సంస్థలో పనిచేస్తున్న దాదాపు 38వేల పైగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. రూ. 10 లక్షల ఆర్థిక భరోసా యూనియన్ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ కలిగి ఉన్న ఉద్యోగి సహజంగా మరణించినా…వారి కుటుంబానికి రూ. 10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందుతుంది. టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు కోటి బీమా ఇకపోతే ఇటీవలే ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం అండగా నిలిచింది.ఆర్టీసీ ఉద్యోగులను భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రమాదవశాత్తు కుటుంబంలో తీవ్ర విషాదం ఏర్పడితే ఆ కుటుంబం తీవ్ర కష్టాల్లో పడకుండా ఆర్థిక ఊరట కలిగించేలా ప్రభుత్వం బీమా సదుపాయం కల్పిస్తోంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగ కుటుంబాలకు రూ.కోటి పరిహారం దక్కుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఉద్యోగి కుటుంబానికి రూ. కోటి ప్రభుత్వం పరిహారం అందించింది. యూబీఐ సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ చాలా మేలు చేస్తోందని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ గతంలో తీసుకున్న యూబీఐ సూపర్ శాలరీ సేవింగ్ అకౌంట్ బాధిత కుటుంబాలకు భారీ ప్రయోజనం కల్పించింది. ఆర్థిక ప్రయోజనంతో కూడిన సూపర్ సాలరీ సేవింగ్ అకౌంట్ కలిగి ఉండటంతో ఉచిత ప్రమాద బీమా పథకం ఆ ఉద్యోగులకు వర్తించింది. టీజీఎస్ఆర్టీసీ సంస్థలోని ఉద్యోగులంతా వారు నివసిస్తున్న ప్రాంతాల్లోని యూబీఐ బ్రాంచీల్లో సంస్థ సూచించిన ఖాతాను తెరిచి రూపే కార్డులను తీసుకున్నారు. ఈ బ్యాంకు అకౌంట్‌తో ఉచిత ప్రమాద బీమా సౌకర్యం ఉండడంతో ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించింది. సహజ మరణానికి కూడా బీమా సౌకర్యం సింగరేణి యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుంది. ఇకపోతే ఇప్పటికే సింగరేణి సంస్థలో కోటి రూపాయల ఉచిత ప్రమాద బీమా సౌకర్యాన్ని అమలు జరుపుతున్న ఇతర బ్యాంకులు కూడా ఇదే విధంగా సహజ మరణానికి కూడా బీమా సౌకర్యాన్ని వర్తింప జేసే విధంగా సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకుంటోంది. సింగరేణి కార్మికులకు ఉచిత బీమా సింగరేణి కార్మికుల కోసం యాజమాన్యం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగరేణి కార్మికులు సహజంగా మరణించినా కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు సింగరేణిలో కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తున్న యూనియన్ బ్యాంక్ సింగరేణి యాజమాన్యం చేసిన సూచనల మేరకు సహజ మరణం చెందిన కార్మికులకు కూడా ఉచిత బీమా సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించింది. యూనియన్ బ్యాంకులో కార్పోరేట్ శాలరీ అకౌంటు కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి పది లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని వర్తింప జేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సింగరేణి సంస్థకు బ్యాంకు యాజమాన్యం తెలియజేసింది. యూనియన్ బ్యాంకులో కార్పోరేట్ శాలరీ అకౌంటు కలిగి ఉన్న కార్మికులు లేదా అధికారులు ఎవరైనా సరే మృతి చెందినట్లయితే వారికి పది లక్షల రూపాయల బీమా సౌకర్యం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇది అమలులోకి రానున్నట్లు బ్యాంకు యాజమాన్యం పేర్కొంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం చొరవతో సింగరేణి కార్మికులకు ఉచిత కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని యూనియన్ బ్యాంకు అమలు జరిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *