వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి మంజూరు

జగన్ విదేశీ టూర్‌కు గ్రీన్ సిగ్నల్... కోర్టు అనుమతి!

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు భారీ ఊరట లభించింది. వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు అనుమతించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు భారీ ఊరట లభించింది. వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు నాంపల్లిలోని సీబీఐ కోర్టు అనుమతించింది. ఏప్రిల్ 20 నుంచి మే 15వ తేదీ మధ్య కాలంలో రెండు వారాల పాటు యూరప్ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ సందర్భంగా సీబీఐ కోర్టు పలు షరతులు కూడా విధించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలోనే ఆయన గతంలో విదేశాలకు వెళ్లిన సందర్భాల్లో కూడా కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ వైఎస్ జగన్ సీబీఐ కోర్టును ఆశ్రయించారు. జగన్ అభ్యర్థనపై విచారణ చేపట్టిన సీపీఐ కోర్టు… ఆయన విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే కొన్ని షరతులు విధించింది. విదేశీ పర్యటనకు వెళ్లే ముందు కోర్టులో రూ. లక్ష విలువైన పూచీకత్తును సమర్పించాలని జగన్‌ను ఆదేశించింది. తన పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు మరియు ఇతర వివరాలను కోర్టుకు అందజేయాలని తెలిపింది. విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత, కోర్టు విచారణకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తప్పనిసరిగా హాజరు కావాలని జగన్‌ను సీబీఐ కోర్టు ఆదేశించింది. అదే విధంగా సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని స్పష్టం చేసింది. ఇక, వైఎస్ జగన్ చివరగా గతేడాది అక్టోబర్‌లో విదేశీ పర్యటనకు వెళ్లారు. సీబీఐ కోర్టు అనుమతితో వైఎస్ జగన్ లండన్ పర్యటనకు వెళ్లారు. వైఎస్ జగన్‌తో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి కూడా లండన్ వెళ్లారు. తమ పెద్ద కుమార్తెను కలిసేందుకు జగన్ దంపతులు 2025 అక్టోబర్ 11న బెంగళూరు నుంచి లండర్ వెళ్లారు. దాదాపు 9 రోజుల తర్వాత వారు తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. లండన్ నుంచి తిరిగి బెంగళూరుకు వచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *