పయనించే సూర్యుడు న్యూస్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండగా…ఏపీకి నాటి సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిని రాజధానిగా ప్రకటించారు.అయితే అమరావతికి రాజధానిగా చట్టబద్దత కల్పించే విషయంలో ఏపీ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోంది. అమరావతికి చట్టబద్దత కల్పించే ప్రక్రియలో భాగంగా సవరణ బిల్లు తీసుకురావాలని నిర్ణయించింది.ఈ మేరకు ఈనెల 28న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేక తీర్మాణం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఆ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక తీర్మానం చేయనుంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న రాజధాని సందిగ్ధతకు తెర దించుతూ అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ అసెంబ్లీలో తీర్మాణం చేయనుంది. అనంతరం ఈ అధికారిక తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంటుకు పంపించాలని ఏపీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతిపై తుది నిర్ణయం తీసుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని తెలుస్తోంది. 28 అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం వెనుకడుగు వేయడం లేదు. నవ్యాంధ్ర రాజధాని అమరావతియేనని తీర్మానించనుంది. ఈ రాజధానికి చట్టబద్దత కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఈనెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు (TDP, జనసేన, BJP) తప్పనిసరిగా హాజరయ్యేలా ప్రభుత్వం పక్కా ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకం రాజధాని. అమరావతిని రాజధానిగా చట్టబద్దత విషయంలో ఊగిసలాట ధోరణి ఉంది. ఈ ప్రక్రియకు ముగింపు పలకాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రత్యేక సమావేశం ద్వారా అమరావతి విషయంలో నెలకొన్న న్యాయపరమైన, రాజకీయపరమైన చిక్కులన్నింటికీ శాశ్వత పరిష్కారం లభించనుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి రాజధానిగా చట్టబద్ధత కోసమే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు: స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కీలక అడుగు పడింది. ఈ నెల 28వ తేదీన (శనివారం) ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారు ప్రకటించారు. అమరావతిని రాజధానిగా గుర్తించాలనే అంశంపై ఇప్పటివరకు చట్టపరమైన స్పష్టత లేదని, ఈ లోటును భర్తీ చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విజయవాడ-అమరావతి ప్రాంతమే రాష్ట్ర రాజధానిగా ఉండాలని అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి, వెంటనే కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు స్పీకర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతిని రాజధానిగా ఆమోదించిందని, అయితే పార్లమెంటులో బిల్లు పాస్ కావాల్సి ఉందని అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. ఈ నెల 4వ తేదీ వరకు పార్లమెంటు సమావేశాలు ఉన్నందున, రాష్ట్ర అసెంబ్లీ చేసే తీర్మానాన్ని వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టం చేయించేలా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ చట్టం పూర్తయితే రాజధాని విషయంలో కొందరు చేస్తున్న విమర్శలకు శాశ్వతంగా తెరపడుతుందని స్పీకర్ స్పష్టం చేశారు. గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఉత్తర్వుల మేరకు వెలగపూడిలోని అసెంబ్లీ హాల్లో ఈ ఆరో సెషన్ జరగనుంది. ఇటీవలే అమిత్ షాను కలిసిన సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టబద్దత కల్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను సీఎం చంద్రబాబు నాయుడు కోరారు. బుధవారం పోలవరం పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రామాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువుర చర్చించుకున్నారు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్దత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. దీని వల్ల రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరగడంతో పాటు… రాష్ట్ర ప్రజల ఆశ నెరవేర్చినట్టు అవుతుందని కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు.