అక్షర ఆయుధం : నిజానికి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ బలపడటమే అని చెప్పవచ్చు. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్లు పలుకుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తంలో డాలర్లను సేకరిస్తున్నాయి. దీంతో అమెరికన్ డాలర్‌కు బలం పెరిగింది.అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధర భారీగా తగ్గుతుంది. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ 4957 డాలర్లు పలుకుతోంది. నిన్నటితో పోల్చి చూస్తే బంగారం ధర దాదాపు 100 డాలర్లు తగ్గినట్లు చూడవచ్చు. ఇక దేశీయ మార్కెట్లో గమనించినట్లయితే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,54,050 పలుకుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,420 పలుకుతోంది. పసిడి ధరలు గడచిన రెండు రోజులుగా భారీగా తగ్గుతున్నాయి. దీనికి ప్రధాన కారణం బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గడమే అని చెప్పవచ్చు. నిజానికి బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లలో తగ్గడానికి ప్రధాన కారణం డాలర్ విలువ బలపడటమే అని చెప్పవచ్చు. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఎక్కువ ధరకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ప్రస్తుతం ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 110 డాలర్లు పలుకుతోంది. ఈ నేపథ్యంలో పలు దేశాలు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి ఎక్కువ మొత్తంలో డాలర్లను సేకరిస్తున్నాయి. దీంతో అమెరికన్ డాలర్‌కు బలం పెరిగింది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను అమెరికా బాండ్లలో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఫలితంగా బంగారం ధరలు తగ్గుతున్నాయని చెప్పవచ్చు. ఎప్పుడైతే అమెరికన్ డాలర్ విలువ పెరుగుతుందో, అప్పుడు బంగారం విలువ తగ్గుతుంది. ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది.ఇదిలా ఉంటే మరోవైపు బంగారం ధర భవిష్యత్తులో పెరిగే అవకాశం ఉందని పలు అంతర్జాతీయ బ్రోకర్ సంస్థలు పేర్కొంటున్నప్పటికీ, స్వల్పకాలికంగా మాత్రం తగ్గడం గమనించవచ్చు. అయితే ప్రస్తుతం దేశీయ మార్కెట్లో మాత్రం బంగారం ధరలు పెద్ద మొత్తంలో తగ్గడం లేదని చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు స్థిరపడిన అనంతరమే దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు తగ్గుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.అయితే ఇప్పటికీ కూడా బంగారం ధర ఆల్ టైం రికార్డ్‌తో పోల్చి చూస్తే దాదాపు 30 వేల రూపాయలు తక్కువగా పలుకుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న నేపథ్యంలో బంగారం ధర ఆల్ టైం రికార్డు స్థాయి కన్నా కూడా తక్కువగా పలుకుతోంది అని చెప్పవచ్చు. అయితే తప్పనిసరి పరిస్థితుల్లో బంగారం కొనుగోలు చేయడం చూడవచ్చు. భవిష్యత్తులో బంగారం ధర కనుక తగ్గినట్లయితే సేల్స్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు ఇంకా ఎక్కువగానే ఉన్న నేపథ్యంలో పసిడి సేల్స్ ఇంకా తక్కువగానే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.