యువతకు ఆదర్శంగా తాప్సీ ఉపాధ్యాయ

పవన్ కల్యాణ్ ప్రశంసలు వెల్లువ

సాక్షి డిజిటల్ న్యూస్ : దేశవ్యాప్తంగా ప్రజారోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఒంటరిగా బైక్‌పై యాత్ర చేస్తున్న ఉత్తరప్రదేశ్‌కు చెందిన యువతి తాప్సీ ఉపాధ్యాయను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అభినందించారు. తాప్సి ఉపాధ్యాయ యాత్ర చాలా మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని అభిలషించారు.23 ఏళ్ల తాప్సీ చేపట్టిన ఈ మిషన్ గొప్పదని కొనియాడారు. యువత ఆరోగ్యమే దేశ అభివృద్ధికి మూలాధారం…దేశ భవిష్యత్ అని తెలియజేస్తూ మిషన్ హెల్తీ భారత్ వ్యవస్థాపకురాలు తాప్సి ఉపాధ్యాయ బైక్ ర్యాలీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒబేసిటీ ముక్త్ భారత్ – మిషన్ హెల్తీ భారత్ పేరుతో ప్రజాఆరోగ్య చైతన్యం కోసం తాప్సీ ఉపాధ్యాయ కృషి చేస్తోంది.ఒబేసిటీ ముక్త్- మిషన్ హెల్తీ భారత్ బైక్ ర్యాలీ ద్వారా 16 రాష్ట్రాలు, 300కు పైగా నగరాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, 10 లక్షలకు పైగా యువతను చైతన్యపరిచారు తాస్పీ ఉపాధ్యాయ. ఇప్పటి వరకు 17,400 కిలోమీటర్ల మేర బైక్ యాత్ర పూర్తి చేసిన తాప్సీ ఉపాధ్యాయ గురువారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మేరఠ్‌కు చెందిన ఈ 23 ఏళ్ల యంగ్ బైకర్ తాప్పీ ఉపాధ్యాయ గురువారం మంగళగిరి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఒబేసిటీ ముక్త్ భారత్ – మిషన్ హెల్తీ భారత్ పేరిట ఆమె చేపట్టిన బైక్ యాత్ర వివరాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పంచుకున్నారు. పవన్ కల్యాణ్‌తో తాప్సీ ఉపాధ్యాయ ప్రజా ఆరోగ్యంపై అవగాహన పెంచుతూ ప్రజల్లో చైతన్యం నింపేందుకు 9 మార్చి 9 2025న మేరఠ్ లో బైక్ యాత్ర ప్రారంభించినట్లు తాప్పీ ఉపాధ్యాయ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తెలియజేశారు. ఇప్పటి వరకు సుమారు 17,400 కిలోమీటర్ల ప్రయాణించి 500పైగా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో యాత్ర విజయవంతంగా పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. మిగిలిన 12 రాష్ట్రాల్లో కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వివరించారు. తాప్సీ ఉపాధ్యాయను సత్కరించిన డిప్యూటీ సీఎం దేశవ్యాప్తంగా బుల్లెట్ పై సోలోగా ప్రయాణిస్తూ ప్రజారోగ్యంపై అవగాహన కల్పిస్తున్న తాప్సీ ఉపాధ్యాయను ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సత్కరించారు. ఆమె యాత్ర చాలా మంది యువతకు స్ఫూర్తిగా నిలవాలని అభిలషించారు.23 ఏళ్ల తాప్సీ చేపట్టిన ఈ మిషన్ గొప్పదని కొనియాడారు.మిషన్ హెల్తీ భారత్ లక్ష్యంతో ఆమె చేపట్టిన సాహసోపేత యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆమె ప్రయాణిస్తున్న బైక్‌ను పరిశీలించారు. ఆమె యాత్రతోపాటు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. అభినందించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ మరోవైపు తాప్సీ ఉపాధ్యాయను ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సైతం అభినందించారు. ఆరోగ్య చైతన్యం కోసం తాప్సీ ఉపాధ్యాయ చేస్తున్న సాహసోపేత యాత్ర స్ఫూర్తిదాయకం అని కొనియాడారు. ఇప్పటివరకు 17,400 కి.మీ బైక్ యాత్ర పూర్తి చేసిన ఆమెను అమరావతి సచివాలయంలో కలిసి తన లక్ష్యాన్ని అభినందించారు. ఈ యాత్ర ప్రజల్లో గొప్ప మార్పు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో ఆరోగ్యవంతమైన భారత్ మన లక్ష్యం అని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు.దేశ భవిష్యత్ యువత ఆరోగ్యంపైనే ఆధారపడి ఉంది : శాప్ చైర్మన్ రవి నాయుడు ఒబేసిటీ ముక్త్ హెల్తీ భారత్ లక్ష్యంతో కొనసాగుతున్న ఈ ఉద్యమం సమయానుకూలమైందని శాప్ చైర్మన్ రవి నాయుడు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఆరోగ్యంపై అవగాహన పెంపు దిశగా మిషన్ హెల్తీ భారత్ చేపడుతున్న కార్యక్రమాలు విశేషంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఒబేసిటీ ముక్త్ భారత్ – ఇండియా టూర్ ద్వారా 16 రాష్ట్రాలు, 300కు పైగా నగరాల్లో విస్తృత ప్రచారం నిర్వహించి, 10 లక్షలకు పైగా యువతను చైతన్యపరిచిన విషయం గొప్ప విజయంగా కొనియాడారు.ఈ సందర్భంగా మిషన్ హెల్తీ భారత్ వ్యవస్థాపకురాలు తాప్సి ఉపాధ్యాయను శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందించారు. దేశ భవిష్యత్తు యువత ఆరోగ్యంపై ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *