సాక్షి డిజిటల్ న్యూస్ : కేంద్ర ప్రభుత్వం తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొత్త గవర్నర్ల నియామకాలను ఆమోదించారు. తెలంగాణ,వెస్ట్ బెంగాల్,మహారాష్ట్ర,బిహార్, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్, ఢిల్లీలకు కూడా కొత్త లెఫ్టినెంట్ గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు రాష్ట్రపతి భవన్ గురువారం (మార్చి 05)న ఒక ప్రకటన వెలువరించింది. భారత రాష్ట్రపతి తొమ్మిది రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ గురువారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. అలాగే పశ్చిమ బెంగాళ్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. అనంతరం లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వినయ్ కుమార్ సక్సేనాను నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త గవర్నర్ల వివరాలను ఓసారి తెలుసుకుందాం. తెలంగాణ గవర్నర్‌గా శివ ప్రతాప్ శుక్లా ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ పదవిలో ఉన్న శివప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్‌గా నియమితులయ్యారు.అలాగే ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమించారు. మరోవైపు నందకిషోర్ యాదవ్ నాగాలాండ్ గవర్నర్‌గా నియమితులు అయ్యారు. మరోవైపు బీహార్ గవర్నర్‌గాసద్ అట హస్నైన్ నియమితులు అయ్యారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్‌గా పనిచేస్తున్న ఆర్.ఎన్.రవి వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా నియమితులు అయ్యారు.అలాగే ప్రస్తుతం కేరళ గవర్నర్‌గా పనిచేస్తున్న రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ తమిళనాడు గవర్నర్‌గా నియమితులు అయ్యారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరంజిత్ సింగ్ సంధు మరోవైపు ప్రస్తుతం లడఖ్ గవర్నర్‌గా పనిచేస్తున్న కవిందర్ గుప్తాకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బాధ్యతలు అప్పగించారు.మరోవైపు ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనాకు లడఖ్ గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఇకపోతే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌గా తరంజిత్ సింగ్ సంధు నియమితులు అయ్యారు.నియమితులైన వారు తమ తమ కార్యాలయాలకు బాధ్యతలు స్వీకరించిన తేదీల నుండి నియామకాలు అమల్లోకి వస్తాయని ఆ ప్రకటన పేర్కొంది.