అక్షర ఆయుధం:రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లసర్స్ ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఏపీలో ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటుకు కేంద్రం ప్రోత్సహిస్తోంది అని శాసనమండలిలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.తల్లికి వందనం పథకం కింద రాష్ట్రంలో 67,01,653 మంది విద్యార్థులకు రూ.8,454 కోట్ల మేర సాయం అందించాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయమని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తల్లికి వందనం పథకం యూడైస్ ప్రకారం రాష్ట్రంలో నమోదైన విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. ‘యూడైస్ ప్రకారం ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో 79,51,903 మంది విద్యార్థులు నమోదయ్యారు. తల్లికి వందనం పథకం కింద రూ.8,454 కోట్లు సాయం అందించాం. 67,01,653 మందికి తల్లికి వందనం వర్తించింది. యూడైస్‌లో 86లక్షల మంది విద్యార్థులు ఉన్నారంటూ వైసీపీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారు. యూడైస్‌లో నమోదైన వారిలో అర్హులందరికీ (84.27%) సాయం అందించాం’అని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు వైసీపీ హయాంలో యూడైస్ కింద 81,72,224 మంది విద్యార్థులు నమోదై ఉంటే కేవలం 42,33,098 మందికి మాత్రమే అంటే 52శాతం మందికి మాత్రమే ఇచ్చారు అని ఏపీ విద్య, ఐటీ,ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సభలో వెల్లడించారు. ‘మేం 85శాతం మందికి సాయం అందించాం. 2020-21 చూస్తే సుమారుగా 83 లక్షల మంది ఉంటే.. కేవలం 44 లక్షల మందికే ఇచ్చారు. 2021-22లో 82 లక్షల మంది ఉంటే.. కేవలం 43 లక్షల మందికే ఇచ్చారు. 2022-23లో 80 లక్షల మంది ఉంటే.. కేవలం 42 లక్షల మందికే ఇచ్చారు. వైసీపీ హయాంలో 52శాతం మంది విద్యార్థులకు ఇస్తే.. ప్రజా ప్రభుత్వంలో 84.27 శాతం మందికి అందజేశాం. తల్లికి వందనం పథకం కింద సాయం అందని వారి వివరాలు పంపిస్తే.. సరిచేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అర్హులందరికీ సాయం అందించాలనేది ప్రజా ప్రభుత్వ నిర్ణయం’అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.కొంతమందికి పాక్షిక సాయం అందించారనే విషయంలో.. సోషల్ వెల్ఫేర్ విభాగంలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. మేం ముందు చెల్లించిన తర్వాత కేంద్రం నిధులు అందజేస్తోంది. రెండూ కలిసికట్టుగా మేం అందిస్తున్నాం. గ్యాప్ ఏమైనా ఉంటే వివరాలు ఇవ్వాలి. పారిశుద్ధ్య కార్మికులందరికీ తల్లికి వందనం వర్తించేలా చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేశ్ చెప్పారు.ఏపీలో ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటు రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లసర్స్ ను ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తామని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ల వివరాలు, ఈఎమ్‌సీలో పరిశ్రమలకు ఇప్పటికే కేటాయించిన భూ విస్తీర్ణం, ఖాళీగా ఉన్న భూ విస్తీర్ణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో మూడు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. వీటి వివరాలు ఇవ్వడం జరిగింది. ఏపీలో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్ ఉంది కాబట్టే ఏపీలో పెట్టుబడులు పెట్టాలని..ఎలక్ట్రానిక్ ఎకో సిస్టమ్ ఏర్పాటుచేయాలని కేంద్రం కూడా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా విశాఖలో ఏసిప్(ASIP) అనే సంస్థకు భూములు కేటాయించడం జరిగింది. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లసర్స్ ను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం. చిన్న, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే యుద్ధప్రాతిపదికన పరిష్కరిస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.