అప్పటిలోగా రాష్ట్రవ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు అమలు.

సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు

సాక్షి డిజిటల్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్‌లో సంజీవని ప్రాజెక్టును జూలైలోగా రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌లో సంజీవని ప్రాజెక్టును జూలైలోగా రాష్ట్రవ్యాప్తంగా అమలయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సీఎం చంద్రబాబు నాయుడు మంగళవారం రోజున ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సంజీవని ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా మెరుగైన ఆరోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఏప్రిల్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వైద్యాధికారులు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. ప్రతీ నెల 4వ శనివారం ‘స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్’ గ్రామసభలు, హెల్త్ క్యాంపులు, అవగాహనా కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. ఇదిలాఉంటే, అమరావతి క్వాంటం వ్యాలీ క్వాంటం హార్డ్ వేర్ ఉత్పత్తి ఎకోసిస్టంపై రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. జాతీయ క్వాంటం మిషన్ ద్వారా చేపట్టిన కార్యాచరణను ఏపీ తొలిగా అందిపుచ్చుకుని అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేసిందని అన్నారు. గతంలో ఐటీని, ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ గా వినియోగించుకుంటున్నామని చెప్పారు. ఐటీలో నిపుణుల్ని తయారు చేయడానికి ఇంజనీరింగ్ కాలేజీలు, ట్రిపుల్ ఐటీలను కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గతంలో వేగవతంమైన టెక్నాలజీ కోసం బ్యాండ్ విడ్త్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులో లేవని చెప్పారు. జాతీయ స్థాయిలో ఈ విధానాలను తీసుకువచ్చేలా చేసి వాటిని సద్వినియోగం చేసుకున్నామని తెలిపారు. అప్పుడు చేసిన విజన్ ఇప్పుడు ఫలితాలు ఇస్తోందని… ఐటీతో పాటు ఫార్మా రంగాన్ని కూడా అందిపుచ్చుకుని జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేశామని చెప్పారు. 100 దేశాలకు జీనోమ్ వ్యాలీలో ఉత్పత్తి అయిన వ్యాక్సిన్‌ను కరోనా సమయంలో సరఫరా చేశారని చెప్పారు. గ్రీన్, క్లీన్ ఎనర్జీ దిశగానూ ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తోందని అన్నారు. ఇది గేమ్ చేంజర్‌గా మారుతుందని తెలిపారు. మైక్రో గ్రిడ్స్ ద్వారా విద్యుత్ రంగంలోనూ పెద్ద ఎత్తున వ్యయం తగ్గించేలా చర్యలు చేపడుతున్నామని తెలిపారు. డేటా సెంటర్లకు కూడా గ్రీన్ ఎనర్జీనే సరఫరా చేస్తామని చెప్పారు. స్పేస్ టెక్నాలజీ, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, మెడ్ టెక్ జోన్స్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అవేర్ ద్వారా రియల్ టైమ్ డేటాను సేకరించటం, రియల్ టైమ్‌లో నిర్ణయాలు జరగాలని చెప్పారు. సంజీవని ప్రాజెక్టుతో వ్యక్తిగత డిజిటల్ హెల్త్ రికార్డులను తయారు చేస్తున్నామని… పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ కూడా తెచ్చామని తెలిపారు. ఏఐ డాక్టర్, ఏఐ ట్యూటర్, ఏఐ అగ్రానమిస్ట్ లాంటి సేవలు పౌరులకు అందించాల్సి ఉందని చెప్పారు. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అనేది ఎప్పుడూ సఫలీకృతం అవుతుందని అన్నారు. ఐటీ ద్వారా ఇప్పుడు సంపద సృష్టి జరుగుతోందని… నాలెడ్జి ఎకానమీ, సేవల రంగం పెరగటం ద్వారా దేశానికి ప్రయోజనం కలుగుతోందని చెప్పారు. భవిష్యత్తు అంతా ఇక క్వాంటం కంప్యూటింగ్‌దేనని సీఎం చంద్రబాబు అన్నారు. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలను అందిపుచ్చుకుని ఏక్వూవీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో తొలి క్వాంటం కంప్యూటర్ ను ఏపీలో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. రాజధాని అమరావతిలో 8 టవర్లను నిర్మించి క్వాంటం టెక్నాలజీని ప్రోత్సహిస్తామని తెలిపారు. క్వాంటం కంప్యూటర్ హార్డ్ వేర్‌ను దిగుమతి కాదు ఇక్కడే తయారు చేసుకోవాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దేశీయంగా క్వాంటం కంప్యూటర్‌ను రెండేళ్ల కాలవ్యవధిలో తయారు చేసుకోవాలని భావిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దీనికి అవసరమైన క్వాంటం పరికరాలు, టెక్నాలజీ, క్రయోజనిక్స్, అల్గారిథమ్స్ ఇలా మనమే తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీతో అమరావతి ఇక భవిష్యత్ నగరం- అత్యుత్తమ లివబుల్ సిటీగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక అమరావతి అన్ స్టాపబుల్- అమెరికన్ సిలికాన్ వ్యాలీతో పోలిస్తే క్వాంటం వ్యాలీకి చాలా వేగం ఎక్కువ అని పేర్కొన్నారు. టెక్నాలజీని, భాగస్వామ్యాలను అందించాలని నేషనల్ క్వాంటం మిషన్‌ను కోరుతున్నామని చెప్పారు. అమరావతి క్వాంటం వ్యాలీ దేశ భవిష్యత్తు, దేశ ప్రగతి ప్రేరకం అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *