జనం న్యూస్: ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్‌చిట్ ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.‘కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడమే అని మండిపడ్డారు. తెలంగాణలో ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పార్టీ మారలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి లకు స్పీకర్ క్లిన్ చిట్ ఇవ్వడం ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు.‘కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిన వ్యక్తికే క్లిన్ చిట్ ఇవ్వడం అంటే ప్రజల తీర్పును అవమానించడం. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ స్పీకర్ తీసుకున్న ఈ నిర్ణయం ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు’గా అభివర్ణించారు. ‘ఇది కేవలం ఒక తీర్పు కాదు అధికారంలో ఉన్నవారికి అనుకూలంగా రాజ్యాంగ వ్యవస్థలను ఉపయోగించే ఉదాహరణ. ప్రజల ఓట్లతో గెలిచిన పదవులను వ్యక్తిగత లాభాల కోసం మార్చుకుంటే, స్పీకర్ దానికి ముద్ర వేస్తే ప్రజాస్వామ్య విలువలు ఎక్కడ నిలుస్తాయి?. ఇలాంటి నిర్ణయాలు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి.తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. సరైన సమయంలో సమాధానం చెబుతారు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు బిగ్ రిలీఫ్ ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తీవ్రంగా ఉత్కంఠ రేపిన ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై దాఖలైన అనర్హత పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఇద్దరూ పార్టీ మారలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారని స్పష్టం చేశారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు బిగ్ రిలీఫ్ లభించినట్లు అయ్యింది. ఎమ్మెల్యేలు ఇద్దరు కూడా పార్టీ మారారు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు అని క్లీన్ చిట్ ఇచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం మార్చి 12వ తేదీలోగా స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి తుది నిర్ణయాన్ని ప్రకటించాల్సిందిగా సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గతంలో ఎనిమిది మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో 10 మంది ఎమ్మెల్యేలకు ఊరట లభించింది. నాలుగురోజుల క్రితం పూర్తైన విచారణ. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బీ కృష్ణమోహన్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్‌గౌడ్, ఎం సంజయ్‌కుమార్, జీ మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీల వ్యవహారంపై విడతల వారీగా స్పీకర్ విచారణ జరిపారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్లపై నాలుగు రోజుల క్రితం విచారణ పూర్తి చేశారు. అనంతరం తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పును ప్రకటించారు. నాలుగురోజుల క్రితం పూర్తైన విచారణ. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడంతో ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, బీ కృష్ణమోహన్‌రెడ్డి, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కాలె యాదయ్య, టీ ప్రకాశ్‌గౌడ్, ఎం సంజయ్‌కుమార్, జీ మహిపాల్‌రెడ్డి, అరికెపూడి గాంధీల వ్యవహారంపై విడతల వారీగా స్పీకర్ విచారణ జరిపారు. ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్‌చిట్ ఇవ్వగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పిటిషన్లపై నాలుగు రోజుల క్రితం విచారణ పూర్తి చేశారు. అనంతరం తీర్పును నేటికి రిజర్వ్ చేశారు. తాజాగా తీర్పును ప్రకటించారు.