జనసేన నేతపై పిఠాపురం వర్మ సంచలన ఆరోపణలు

సాక్షి డిజిటల్ న్యూస్:  నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్‌వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత పెండెం దొరబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పిఠాపురం నియోజవర్గం మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత ఎస్‌వీఎస్ఎన్ వర్మ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత పెండెం దొరబాబుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జనసేనలో గతంలో ఉన్న నాయకులతో తమకు ఎలాంటి విభేదాలు లేవని పేర్కొన్న వర్మ. పెండెం దొరబాబుపై తీవ్ర ఆరోపలు చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు ఫొటో లేదని ప్రశ్నించినందుకు తనపై, తమ టీడీపీ కార్యకర్తలపై దాడి చేసి అనరాని మాటలు అంటారా? అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గెలుపునకు వ్యతిరేకంగా పనిచేసిన దొరబాబు. ఈరోజు జనసేనలో చేరి కూటమిలో పెత్తనం చలాయిస్తున్నాడని అన్నారు. దొరబాబు వైసీపీ కోవర్టుగా పనిచేస్తూ కూటమిలో తగాదాలు సృష్టిస్తున్నారని ఎస్‌వీఎస్‌ఎస్ వర్మ ఆరోపించారు. ఇదిలాఉంటే, ఆంద్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో చోటుచేసుకునే రాజకీయ పరిణామాలు హాట్ టాపిక్‌గా మారుతుంటాయనే సంగతి తెలిసిందే. తాజాగా పిఠాపురం నియోజకవర్గంలో కూటమిలో భాగమైన జనసేన, టీడీపీ నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఫ్లెక్సీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఫొటో లేకపోవడం టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేయగా. ఆ తర్వాత టీడీపీ, జనసేనల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే. పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) కార్యాలయం వద్ద మంగళవారం పీఎంఏజేఏవై కార్యక్రమం కింద వీఓఏల సెల్‌ఫోన్ల పంపిణీని నిర్వహించారు. పాడా పీడీ శివరామ్‌ప్రసాద్‌ కూటమి నేతలను ఆహ్వానించడంతో జనసేన నుంచి డీసీసీబీ ఛైర్మన్‌ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ఎన్ హాజరయ్యారు. ఒక బ్యానర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై ఎస్‌వీఎస్ఎన్ వర్మ, టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో సీఎం ఫొటో ఎందుకు వేయలేదని పీడీని ప్రశ్నించారు. అయితే అక్కడే ఉన్న డీసీసీబీ ఛైర్మన్‌ రామస్వామి వేదికపై ఏర్పాటుచేసిన ఫ్లెక్సీపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ల ఇద్దరి ఫొటోలు ఉన్నాయని చెప్పారు. అయితే మాజీ ఎమ్మెల్యే, జనసేన నేత పెండెం దొరబాబు కలగజేసుకుని అధికారులు ప్రొటోకాల్‌ ప్రకారమే కార్యక్రమం చేపట్టారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో దొరబాబు, వర్మ మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చెలరేగి, వారు ఒకరినొకరు తోసుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని గొడవ పెద్దది కాకుండా నియంత్రించారు. అనంతరం ఎస్‌వీఎస్ఎన్ వర్మ విలేకర్లతో మాట్లాడుతూ సీఎం ఫొటో లేకుండా అధికారిక కార్యక్రమాలు చేపట్టడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. అధికారులు పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ఫొటో వేయడం లేదని ఆరోపించారు. తమ నాయకుడికి అవమానం జరిగితే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అలాగే పవన్ కల్యాణ్‌కు అవమానం జరగిన ఊరుకోమని అన్నారు. పవన్ కల్యాణ్‌కు వ్యతిరేకంగా డబ్బు ఖర్చు చేసింది, మందు పంచింది దొరబాబు అని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యేగా ఉన్న దొరబాబు ఆయన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికే జనసేనలో చేరారని ఆరోపించారు. ప్రొటోకాల్‌ వివాదంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. తమకు జనసేనతో గొడవ లేదని తెలిపారు. మరోవైపు దొరబాబు మాట్లాడుతూ తన అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ప్రభుత్వ కార్యక్రమాల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *