కీలక తీర్పు వెలువరించిన కోర్టు

కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట!

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంకేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులకు భారీ ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎంకేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులకు భారీ ఊరట లభించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ ఘోష్ కమిషన్‌పై దాఖలైన పిటిషన్‌పై బుధవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని అభిప్రాయపడింది. ఈ క్రమంలో నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. సహజ న్యాయసూత్రాలను విస్మరించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు బుధవారం సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అప్పటి ప్రభుత్వ పెద్దలు మరియు సంబంధిత అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ ప్రక్రియలో సహజ న్యాయ సూత్రాలను విస్మరించారని, నిబంధనలకు విరుద్ధంగా విచారణ సాగిందని తెలంగాణ హైకోర్టు అభిప్రాయపడింది. ముఖ్యంగా విచారణ కమిషన్ల చట్టంలోని సెక్షన్ 8B, 8C ప్రకారం బాధ్యులకు నోటీసులు ఇచ్చి వారి వివరణ తీసుకోవాల్సి ఉన్నప్పటికీ. ఆ ప్రక్రియను సరిగ్గా అనుసరించలేదని పిటిషనర్లు చేసిన వాదనతో న్యాయస్థానం ఏకీభవించింది. కమిషన్ రద్దు చేయాలన్న పిటిషన్లపై స్టే. మరోవైపు కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యాలు, అవినీతి ఆరోపణలపై ప్రస్తుత ప్రభుత్వం నియమించిన ఈ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ దాఖలైన పిటిషన్లపైనా హైకోర్టు విచారణ జరిపింది. మరోవైపు కాళేశ్వరం బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ నిమిత్తం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. ఈ కమిషన్ బ్యారేజీల్లో అవకతవకలపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అయితే ఈ కమిషన్ ఏర్పాటును సవాల్ చేస్తూ 2024 మార్చి 14న మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్‌కే జోషిలు వేర్వేరుగా పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను రద్దు చేయాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మెుహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. విచారణ అనంతరం తీర్పును ఏప్రిల్ 22కు రిజర్వు చేసింది. దీంతో ఈ రోజు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూశారు. అయితే హైకోర్టు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని ఆదేశించడంతో మాజీ సీఎం కేసీఆర్, మాజీమంత్రి హరీశ్ రావులతోపాటు ఐఏఎస్ అధికారులు స్మిత సబర్వాల్, ఎస్‌కే జోషిలకు హైకోర్టులో ఊరట లభించినట్లు అయ్యింది. సుప్రీంకోర్టును ఆశ్రయించే ఛాన్స్.ఇకపోతే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు తీర్పు కోసం సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూశారు. అటు అధికార కాంగ్రెస్ ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలు తీర్పు కోసం వేచి చూశాయి.హైకోర్టు తీర్పుతో నివేదిక ఆధారంగా క్రిమినల్ చర్యలు లేదా తదుపరి విచారణలు చేపట్టాలనుకున్న ప్రభుత్వ ఆలోచనలకు బ్రేక్ పడినట్లు అయ్యింది. అయితే హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *