అక్షర ఆయుధం ; పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి టీడీపీ, జనసేన పార్టీల మధ్య గొడవలు మరోసారి బహిర్గతం అయ్యాయి. పాడ (PADA) కార్యాలయంలో నిర్వహించిన‘PM-AJAY’కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో ఎస్వీఎస్ఎన్ వర్మ నిలదీశారు. అందుకు జనసేన నేతలు తుమ్మల బాబు, పెండెం దొరబాబులు కౌంటర్ ఇచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం, బీజేపీ,జనసేన పార్టీలు కలిసి పోటీ చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నాయి. ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇప్పుడు అధికారిక కార్యక్రమాల్లో ఏ పార్టీ నేతను పిలవకపోయినా… మూడు పార్టీలలో ఏ పార్టీ అధినేత ఫోటో వేయకపోయినా ఇక భగ్గుమంటుంది. ఈ ఫ్లెక్సీల దగ్గర నెలకొంటున్న వివాదం తారాస్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. మంత్రుల ఎదుట కూడా ఈ అంశాలపై గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ ప్రోటోకాల్, ఫ్లెక్సీ వార్ తారాస్థాయికి చేరుకుంటుంది. తాజాతా పిఠాపురం పాడ కార్యాలయంలో నిర్వహించిన PM-AJAY కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంపై టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సీఎస్వీఎస్ఎన్ వర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఫ్లెక్సీ గొడవ ఏకంగా ఉద్రిక్తతలకు దారి తీసింది. పిఠాపురం కూటమిలో లుకలుకలు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో మరోసారి జనసేన, టీడీపీ నేతల మధ్య లుకలుకలు బయటపడ్డాయి. ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంతో మెుదలైన గొడవ ఏకంగా బాహాబాహికి దిగేంతగా జరిగింది. ఈ క్రమంలో నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన నేత పెండెం దొరబాబు దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పిచ్చి పిచ్చివేషాలు వేయోద్దు అంటూ పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మపై దూసుకెళ్లడంతో పెద్ద తోపులాటే జరిగింది. అయితే ఇరువురుని చెదరగొట్టిన ఇతర నాయకులు వివాదం మరింత పెద్దది కాకుండా శాంతింప జేశారు. అసలేం జరిగింది? పిఠాపురం పాడ కార్యాలయంలో PM-AJAY కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి జనసేన, టీడీపీకి చెందిన కీలక నేతలు హాజరయ్యారు. ట్యాబ్ల పంపిణీ కోసం అధికారులు ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటో లేకపోవడంతో ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై జనసేన నేత తుమ్మల బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇరువురు మధ్య వాగ్వాదం జరిగింది. అటు ఎస్వీఎస్ఎన్ వర్మ మద్దతు దారులు, జనసేన మద్దతు దారులు అక్కడికి భారీగా చేరుకున్నారు. ఈ క్రమంలో ఎస్వీఎస్ఎన్ వర్మ, తుమ్మల బాబుల మధ్య మాటల యుద్ధం ముదురుతుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మరో జనసేన నేత పెండెం దొరబాబు ఎస్వీఎస్ఎన్ వర్మపై తీవ్ర ఆగ్రహంతో రెచ్చిపోయారు. పిచ్చిపిచ్చి వేషాలు వేయోద్దు అంటూ వర్మకు వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఇరువురు మద్దతు దారులు నెట్టుకున్నారు. ఒకానొక దశలో దాడి జరుగుతుందనే ఆందోళన కలిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు పార్టీ పెద్దలు వారిని శాంతింపజేశారు.