అక్షర ఆయుధం : ఆన్‌లైన్ గేమింగ్ ఐదురు ప్రాణాలను బలి తీసుకుంది. ఇంటి యజమాని ఆన్ లైన్ గేమింగ్‌కు బానిసగా మారాడు. ఇలా దాదాపు రూ.40 లక్షల వరకు అప్పు అయ్యాడు. అవి తీర్చే మార్గం తెలియక కన్నతల్లి, తాళికట్టిన భార్యను చంపేశాడు. ఆ తర్వాత పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతి జిల్లాలో ఐదుగురు మృతి కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. తిరుపతి జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఒక మిస్టరీగా మారింది.ఒకేరోజు ఐదుగురు మృతి చెందడం అందులోనూ ఇద్దరు హత్యకు గురవ్వడం ఈ కేసు మిస్టరీ పోలీసులకు ఒక సవాల్‌గా మారింది. అయితే పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరకు మృతికి కారణాల గుట్టురట్టు చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం, అప్పుల భారమే ఈ మరణాలకు కారణంగా తేలింది.ఇంటి యజమాని మోహన్ తన కన్నతల్లి, భార్యను అత్యంత దారుణంగా హత్య చేసి ఆ తర్వాత పిల్లలతో కలిసి రైల్వేస్టేషన్ వద్దుకు వెళ్లి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తండ్రిని కాపాబోయే తరుణంలో తండ్రితో సహా ఆ పిల్లలు ఇద్దరూ కూడా మృతి చెందారు. ఐదుగురు మృతి కేసులో వీడిన మిస్టరీ వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంకు చెందిన మోహన్ ఏప్రిల్ 22(బుధవారం) తన తల్లి చంద్రకళ, భార్య హరితలను ఇంట్లోనే హత్య చేశాడు. ఆ తర్వాత పిల్లలు ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొచ్చాడు ఆ తర్వాత రైల్వే స్టేషన్ వద్దకు పిల్లలను తీసుకెళ్లాడు. రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ విషయాన్ని గమనించిన పిల్లలు తండ్రిని కాపాడేప్రయత్నంలో వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. తండ్రిని సైతం రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడం సంచలనంగా మారింది. ఈ మరణాలపై విచారణ పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. కారణాలు కనుక్కోవడం పోలీసులకు కష్టంగా మారింది. అయినప్పటికీ లోతుగా ఆరా తీయగా మోహన్ కొంతకాలంగా ఆన్‌లైన్ గేమింగ్‌కి బానిసగా మారినట్లు పోలీసుల విచారణలో తేలింది.రూ.40 లక్షల వరకు అప్పులు చేసినట్లు తెలిసింది. ఉన్న ఆస్తులు, బంగారం అమ్మి అప్పులు తీర్చినా, ఇంకా అప్పుల ఊబిలోనే కూరుకుపోయాడు. మోహన్ అప్పులు, ఆన్ లైన్ గేమింగ్ వ్యసనం గురించి తెలుసుకున్న భార్య భర్తను నిలదీసింది. రూ.40 లక్షలు ఎందుకు అయినట్లు అని ఆరా తీసింది. ఈ విషయంలోనే దంపతుల మధ్య గొడవలు జరిగేవి. ఈ క్రమంలోనే మోహన్ ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు మోహన్ తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో అతడి మరణానంతరం వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదులకున్నాడు.మరోవైపు భార్య హరిత ఒకవైపు బ్యూటీపార్లర్ మరోవైపు టైలరింగ్ పనులు చేస్తూ భర్తకు సహకరించేది. ఇటీవలే భర్త అప్పుల పాలవ్వడంతో అతడిని మార్చాలని ప్రయత్నించింది. ఇటీవల చీటీ డబ్బులతో భర్తకు ఒక సిమెంట్ షాపు కూడా పెట్టించింది. అయినప్పటికీ మోహన్ తన వ్యసనాన్ని వదల్లేకపోయాడు.అప్పుల ఊబి నుంచి బయటపడే మార్గం లేక ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇకపోతే గురువారం ఐదు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. దీంతో వారు స్వగ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. భోజనం తెస్తానని ఇంటికెళ్లి… వివరాల్లోకి వెళ్తే తిరుపతి జిల్లా నారాణ వనం మండలం వెంకట కృష్ణపాలెం పంచాయతీ చాకలి వీధిలో మోహన్ తన తల్లి చంద్రకళ(65), భార్య హరిత(33), కుమారుడు కౌశిక్(14), కుమార్తె హరిణి(12)తో కలిసి నివాసం ఉంటున్నాడు. మోహన్ నారాయణ వనంలో సిమ్మెంట్ షాప్ నిర్వహిస్తుండగా..భార్య హరిత టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇకపోతే పిల్లలు కౌశిక్ పుత్తూరులోని ఓ ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతుండగా కుమార్తె హరిణి 7వ తరగతి చదువుతుంది.