బీఆర్ఎస్‌పై సీతక్క దుమారం

*అవినీతి ఆరోపణలపై కఠిన వార్నింగ్

సాక్షి డిజిటల్ న్యూస్ : అంగన్వాడీ టీచర్లకు అందించిన సెల్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి ధనసరి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది అంటూ ఘాటుగా హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క)బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ సోషల్ మీడియాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై అవినీతి ఆరోపణలు చేస్తే చెప్పుతెగుద్ది అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సెల్ ఫోన్ల కొనుగోలులో తాను అవినీతికి పాల్పడినంటూ దొంగ లెక్కలు వేసి తనపై నిందనలు వేస్తున్నారని మండిపడ్డారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే చెప్పుతెగుద్ది అని తీవ్రంగా మండిపడ్డారు. టెండర్ వేసింది తాను కాదని…తన శాఖ కూడా కాదని…థర్డ్ పార్టీ టెండర్ వేసింది అని మంత్రి సీతక్క చెప్పుకొచ్చారు. 11650కి మెుబైల్ కొనుగోలు చేస్తే 14 వేల రూపాయలకు కొనుగోలు చేశారని దొంగ లెక్కలతో నిందలు మోపాలని చూస్తే సహించేది లేదు అంటూ మంత్రి సీతక్క ఘాటుగా హెచ్చరించారు. తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుద్ది తెలంగాణ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న అవినీతి ఆరోపణలపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క)తీవ్రంగా ఖండించారు. స్త్రీ శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు అందించిన సెల్‌ఫోన్ల కొనుగోలులో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా చేస్తున్న ఆరోపణలను సీతక్క తీవ్రంగా ఖండించారు.వాస్తవాలు తెలుసుకోకుండా ప్రభుత్వ పథకాలపై ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే చెప్పు తెగుతుంది అంటూ గట్టిగా హెచ్చరించారు. అంగన్వాడీ టీచర్ల కోసం ఒక్కో సెల్‌ఫోన్‌ను రూ.11,650కే కొనుగోలు చేశామని కానీ కొందరు రూ.14 వేలకు కొన్నట్లు దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. మెుబైల్ ఫోన్ల కొనుగోలులో స్కాం నిరాధారం అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్ల కొనుగోలుపై స్కాం అంటూ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేశారు. కేంద్రం నిర్దేశించిన స్పెసిఫికేషన్స్, ధరల ప్రకారం ఓపెన్ టెండర్ ద్వారా GeM పోర్టల్‌లోనే కొనుగోలు చేశామని తెలిపారు. రూ.14వేలకు సెల్ ఫోన్ కొనాల్సి ఉండగా తాము టెండర్ వేసి మరీ తక్కువకు మెుబైల్ ఫోన్లు అందించామని అన్నారు. ఒక్కో మెుబైల్‌ రూ.11,650కి అందజేసినట్లు తెలిపారు. తాము ఈ టెండర్ ద్వారా ప్రభుత్వ ధనాన్ని ఆదా చేసినట్లు చెప్పుకొచ్చారు. పొరుగు రాష్ట్రాలలో ఒక్క మెుబైల్‌ను రూ.11,800 నుంచి 12 వేలు వరకు కొనుగోలు చేస్తే తాము మాత్రం చాలా తక్కువకు టెండర్ వేసి అందించామని చెప్పుకొచ్చారు. ఇవేమీ తెలియకుండా బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీఆర్ఎస్ సోషల్ మీడియా తనపై తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఫోన్లను ఎక్కువ ధరగా చూపిస్తూ ఊహాజనిత కథనాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సహించం అంగన్వాడీలకు అందజేసిన మెుబైల్స్‌ రూ.11,650 కి అందిస్తే రూ.14వేలకు అందించినట్లు బీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా విషపూరిత ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వధనాన్ని తాము ఆదా చేస్తే ఇలా అవగాహన లేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అలాంటిట తప్పుడు ఆరోపణలు చేసే వారికి చెప్పు తెగుద్ది అని వార్నింగ్ ఇచ్చారు.టెండర్ వేసింది తాను కాదు. తన శాఖ కాదు థర్డ్ పార్టీ టెండర్ వేసింది అని వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని…కాంగ్రెస్ శ్రేణులు ఇకపై తప్పుడు ప్రచారాన్ని దీటుగా తిప్పికొట్టాలని మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *