అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించిన పార్లమెంట్

బిల్లు ఆమోదం

అక్షర ఆయుధం : ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పించేందుకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టసవరణ బిల్లకు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ బిల్లుకు బుధవారం రోజున లోక్‌సభ ఆమోదం తెలుపగా… గురువారం రోజున రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా అధికారికంగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026ను పార్లమెంటు ఆమోదించినట్టు అయింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అమరావతి చట్టబద్దత కల్పించాలనే తీర్మానానికి ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014లోని సెక్షన్-5(2)ను సవరించి… ‘అమరావతి’ అనే పదాన్ని చట్టంలో చేర్చేలా అసెంబ్లీ తీర్మానం చేసింది. శాసనసభ ఆమోదం పొందిన ఈ తీర్మానాన్ని అనంతరం కేంద్రం వద్దకు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా గుర్తించే బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చింది.బుధవారం రోజున లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2026 కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లు లోక్‌సభలో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, వైసీపీ, శివసేన (యూబీటీ), సమాజ్‌వాదీ సహా పలు పార్టీల ఎంపీలు చర్చలో పాల్గొన్నారు. వైసీపీ మినహా లోక్‌సభలోని దాదాపు అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతునిచ్చాయి. ఈ బిల్లు సమయంలో వైసీపీ సభ్యులు సభలో నుంచి వాకౌట్ చేశారు.లోక్‌సభలో ఆమోదం పొందిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ), 2026 బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్‌ గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి ఈ బిల్లుపై చర్చ ప్రారంభించారు. దీనిపై పలు పార్టీల సభ్యులు మాట్లాడారు. రాజ్యసభలో ఈ బిల్లుపై జరిగిన చర్చకు మంత్రి నిత్యనందరాయ్ సమాధానమిచ్ారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి కొత్త రాజధానిగా రాబోతోందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలకు తన శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ సాధన కల, సంకల్పాన్ని నెరవేర్చడంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కొత్త శిఖరాలను అధిరోహించి, అర్థవంతమైన పాత్ర పోషిస్తుందని మేము ఆశిస్తున్నాము’’ అని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ పేర్కొన్నారు. దీనిని ఒక చారిత్రాత్మక సందర్భం అని అభివర్ణించారు.బిల్లుపై చర్చ సమయంలో వైసీపీ వాకౌట్‌ చేసింది. వైసీపీ మినహా ఈ చర్చలో పాల్గొన్న పార్టీలు అన్ని బిల్లుకు మద్దతు తెలిపాయి. దీంతో ఈ బిల్లు రాజ్యసభలో కూడా మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదం పొందినట్టుగా చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సపమయంలో రాజ్యసభ గ్యాలరీలో ఉన్న ఏపీ మంత్రి లోకేష్, కూటమి చెందిన పలువురు లోక్‌సభలో ఉన్న ఎంపీలు లేచి నిలబడి నమస్కారం తెలిపారు.ఇక, పార్లమెంట్ ఆమోదం పొందిన బిల్లు రాష్ట్రపతి వద్దకు చేరనుంది. ఈ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేసిన తర్వాత చట్టంగా మారనుంది.పార్లమెంట్‌లో అమరావతి చట్టబద్దత కల్పించే బిల్లుకు ఆమోదం లభించడంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో కూటమి నేతలు సంబరాల్లో మునిగిపోయారు. అమరావతి ప్రాంతంలో రైతులతో కలిసి కూటమి నేతలు సంబరాల్లో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *