ఏపీలో పింఛన్ పథకం అమలు… తొలి దశలో 1.53 లక్షల మందికి లబ్ధి

1.53 లక్షల మందికి మొదటి విడతలో ప్రయోజనం

పయనించే సూర్యుడు న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. వచ్చే జూన్ నుంచి కొత్త పింఛన్లు ఇవ్వాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలో తొలుత వితంతువులకు పింఛన్ భరోసా కల్పించాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకోబోతున్న తరుణంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న మరియు కొత్తగా అర్హులైన వారందరి నుండి కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులను ఆహ్వానించాలని యోచిస్తుంది. ముందుగా అర్హులకు వితంతు పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. అనంతరం వృద్ధాప్య, ఒంటరి పెన్షన్లు ఇవ్వనుంది. ఇకపోతే గత కొంతకాలంగా పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న లక్షలాది మంది సామాన్యులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. 1.53 లక్షల మందికి వితంతు పెన్షన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తెలిపింది. వచ్చే జూన్ నుంచి కొత్త పింఛన్లు ఇవ్వాలనే యోచనలో ఉంది. ఈ క్రమంలో తొలుత వితంతువులకు పింఛన్ భరోసా కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పేరుతో సామాజిక పింఛన్లు అందిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కేవలం స్పౌజ్ పింఛన్లు మాత్రమే అందించింది. కానీ కొత్తగా వితంతు పింఛన్లు ఇంతవరకు అందించలేదు. దీంతో ముందుగా వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 1.53 లక్షల మంది వితంతు పింఛన్లకు అర్హులుగా తేలింది. నాలుగు వేల రూపాయల చొప్పున వీరికి పింఛన్ మొత్తం అందనుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతినెల రూ.61 కోట్లు అదనపు భారం పడనుంది. దరఖాస్తు చేసుకోనున్న 10 లక్షల మంది దాదాపు రెండేళ్లుగా కొత్త పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం పెన్షన్లకు నోటిఫికేషన్ ఇస్తే సుమారు 10 లక్షల మంది కొత్తగా పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ గణాంకాలు అంచనా వేస్తున్నాయి. వృద్ధులు, దివ్యాంగులు మరియు ఇతర కేటగిరీల కింద కొత్త దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. దీనికోసం ప్రత్యేకంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో దరఖాస్తు ప్రక్రియను సరళతరం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వితంతు పెన్షన్‌లో కొత్త మార్గదర్శకాలు ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం పెన్షన్ తీసుకుంటున్న భర్త చనిపోతే ‘స్పౌజ్ (Spouse)’ కేటగిరీ కింద ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే భార్యకు పెన్షన్ బదిలీ చేస్తున్నారు. అయితే పెన్షన్ పొందని వ్యక్తి చనిపోతే అతని భార్య వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి సందర్భాల్లో కూడా వెంటనే వితంతు కేటగిరీ కింద పెన్షన్ మంజూరు చేసేలా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల నిస్సహాయ స్థితిలో ఉన్న మహిళలకు తక్షణ ఆర్థిక భరోసా లభించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *