భారత నౌకాదళానికి మూడో అణు జలాంతర్గామి ‘అరిధామన్’ చేరిక

* సముద్రంలో భారత పౌరుషం-‘అరిధామన్’ తో కొత్త అధ్యాయం

పయనించే సూర్యుడు న్యూస్ : జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిధామన్‌ను శుక్రవారం భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు ఇండియా తన మూడవ స్వదేశీ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ మిసైల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిధామన్‌ను శుక్రవారం భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టిందని ANI న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్ చేసింది. కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఐఎన్ఎస్ అరిధామన్, ఒక పదం మాత్రమే కాదు, ఒక శక్తి అంటూ ట్వీట్ చేశారు. అరిధామన్ జలాంతర్గామి సుమారు 7000 టన్నుల బరువు కలిగి, ఇంతకు ముందున్న వాటి కంటే పెద్దదిగా ఉంటుంది. మెరుగైన స్టెల్త్, అకౌస్టిక్ పనితీరు కోసం దీని బాడీని రూపొందించారు. 83 మెగావాట్ల కాంపాక్ట్ లైట్ వాటర్ రియాక్టర్‌తో కూడిన ఈ జలాంతర్గామిని, మెరుగైన రహస్యత , మన్నికతో రూపొందించారు. ఇది అడ్వాన్స్‌డ్ స్వదేశీ సోనార్ సిస్టమ్స్, ధ్వని నిరోధక సాంకేతికతలను కలిగి ఉంది, ఇవి అండర్ వాటర్ డిటెక్షన్, సర్వైవబిలిటీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. గతంలో రూపొందించిన జలాంతర్గాములతో పోలిస్తే దీని మిసైల్ కెపాసిటీ ఎక్కువ. ఐఎన్ఎస్ అరిధామన్‌లో ఎనిమిది వర్టికల్ లాంచ్ సిస్టమ్ ట్యూబ్‌లను అమర్చారు, ఇది గత జలాంతర్గాముల కంటే రెట్టింపు. దీనివల్ల ఇది 750 కిలోమీటర్ల పరిధి గల 24K-15 సాగరిక మిసైల్స్ లేదా 3,500 కిలోమీటర్ల పరిధి గల ఎనిమిది K-4 మిసైల్స్ మోయగలదు. భవిష్యత్తులో రాబోయే సుమారు 6,000 కిలోమీటర్ల పరిధి గల K-5 మిసైల్స్‌కు కూడా ఇది సపోర్ట్ చేయగలదని భావిస్తున్నారు. ఐఎన్ఎస్ అరిధామన్ మొదటి రెండు జలాంతర్గాముల కంటే పెద్దది , మరింత శక్తివంతమైనది. ఈ శ్రేణిలోని 4వ SSBN సముద్ర ట్రయల్స్ దశలో ఉంది , వచ్చే ఏడాది ఈ కొత్త అణు జలాంతర్గామి కూడా ప్రారంభించబడుతుంది. ఇది కూడా అరిధామన్ తరగతికి చెందినదే. ఇప్పటివరకు నిర్మించిన జలాతర్గాములలో కెల్ల పెద్దది, మరింత శక్తివంతమైనది ఐదవ SSBN నిర్మాణం ఇప్పటికే కొనసాగుతోంది. భారతదేశం న్యూక్లియర్ ట్రియాడ్‌ను పూర్తిచేసింది, అంటే అది గాలి, భూమి , సముద్రంలో కూడా అణ్వాయుధాలను ప్రయోగించగలదు. శత్రువుల రాడార్లకు చిక్కకుండా సముద్రగర్భంలో దాక్కుని అణు దాడిని తిప్పికొట్టగల (న్యూక్లియర్ ట్రియాడ్ ) సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. సముద్రంలో భారత అణ్వాయుధాలు కలిగిన అతికొద్ది దేశాలలో ఇండియా కూడా ఒకటి. అమెరికా, రష్యా, యూకే, ఫ్రాన్స్ , చైనా వంటి దేశాలు కూడా ఈ రకమైన ఆయుధానాలను కలిగి ఉన్నాయి. భారత నౌకాదళం తన మొదటి, పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన న్యూక్లియర్ ఎటాక్ సబ్‌మెరైన్ (SSN) 2036-2037 నాటికి, ఆ తర్వాత సుమారు రెండు సంవత్సరాలలో రెండవ దానిని అందుబాటులోకి తీసుకువచ్చే యోచనలో ఉన్నారు. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) మొదటి రెండు SSNలకు ఆమోదం తెలిపింది. దేశ రక్షణ రంగంలో ఐఎన్‌ఎస్ అరిహంత్, ఐఎన్‌ఎస్ అరిఘాట్ తర్వాత రానున్న ఈ జలాంతర్గామిని అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తున్నారు. ఐఎన్ఎస్ అరిధామన్, భారత జలాల్లోకి ప్రవేశించేందుకు సిద్దంగా ఉంది, దేశ సముద్ర రక్షణ సామర్థ్యాన్ని పెంచడంలో ఎంతో కీలకంగా పనిచేస్తుంది.




Leave a Reply

Your email address will not be published. Required fields are marked *