ఖవాతీన్ గ్రూప్ కార్యకలాపాలపై విచారణ వేగవంతం

* మహిళలను తీవ్రవాద దిశగా మళ్లించే ప్రయత్నాలు? ఖవాతీన్ గ్రూప్‌పై అనుమానాలు

పయనించే సూర్యుడు న్యూస్ : విజయవాడ ఉ్రగమూలాల కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహిళలే టార్గెట్‌గా ఖవాతీన్ అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసింది. మహిళల్ని జిహాదీలుగా మార్చడమే ఈ ఖవాతీన్ గ్రూప్ లక్ష్యం. ఈ ఖవాతీన్ గ్రూప్ ఇన్‌చార్జిగా హైదరాబాద్ యువతి సైదా బేగం వ్యవహరించినట్లు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పేర్కొంది. విజయవాడలో ఇటీవలే ఉగ్రమూలాలు బయటపడిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే.ఈ కేసును మరింత లోతుగా విచారణ జరపగా దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటి వరకు ఉగ్రవాదులు యువత (మగవారు)నే టార్గెట్ చేసుకునేవారు. వారిని రెచ్చగొట్టి ఉగ్రవాదం వైపు మళ్లించుకునేందుకు వ్యూహాలు రచించేవారు. ఖవాతీన్ గ్రూప్ లక్ష్యాలు ఇవే ఇకపోతే ఖవాతీన్ గ్రూప్ బాధ్యతలను హైదరాబాద్ యువతి అయిన సైదా బేగం చాలా చిత్తశుద్ధితో నిర్వహించేదని పోలీసుల విచారణలో తేలింది.ఈ క్రమంలోనే సైదా బేగంకు విదేశీ హ్యాండ్లర్లతో పరిచయాలు మరింత బలపడ్డాయని గుర్తించారు. పాకిస్తాన్, జమ్మూ కశ్మీర్‌లోని జిహాదీలతో సంబంధాలు ఉన్నాయని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ తమ దర్యాప్తులో నిర్ధారించింది. భారత్‌లో ఇస్లామిక్ రాజ్యస్థాపనే లక్ష్యంగా యువతను జిహాద్ వైపు మళ్లించడమే ఖవాతీన్ లక్ష్యంగా దర్యాప్తులో తేలింది. పాకిస్తాన్,బంగ్లాదేశ్, యూఏఈ, ఆఫ్ఘనిస్తాన్, సిరియా వంటి దేశాలకు చెందిన మహమ్మద్ హుజైఫా, నింజా, హేంరోక్సీ, అబూ మహరీబ్, అబూ బలూచీలు హ్యాండ్లర్లుగా వ్యవహరించినట్లు కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పేర్కొంది. ఈ విదేశీ హ్యాండ్లర్లు అంతా నిషేధిత ఉగ్రవాద సంస్థలైన ఐసిస్, అల్ ఖైదా ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్(ఏక్యూఐఎస్) తరఫున పనిచేసినట్లు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ పేర్కొంది. వీడియోలతో యూత్‌ను ప్రేరేపించడం బెనెక్స్ కామ్ వేదికగా చర్చలు జిహాద్ కోసం యువతను పంపించడం(హిజ్రాత్), జిహాద్ ద్వారా భారత్‌లో ఇస్లామిక్ రాజ్యం ఏర్పాటు(ఖిలాఫత్) కోసం విదేశీ హ్యాండ్లర్లతో కలిసి నిందితులు పనిచేసేవారు అని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నిర్ధారించింది. ఇందుకోసం బెనెక్స్ కామ్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్‌లలో గ్రూపులు ఏర్పాటు చేసి వాటిలో ఉగ్రవాద శిక్షణపై తరచూ చర్చించుకునేవారని గుర్తించారు. ఈ బెనెక్స్ కామ్ గ్రూపులో విజయవాడకు చెందిన మహమ్మద్ రహమతుల్లా షరీఫ్, మీర్జా సోహైల్ బేగ్, మహమ్మద్ డానిష్, హైదరాబాద్‌కు చెందిన సైదా బేగం, కర్ణాటకలోని బళ్లారికి చెందిన అబ్దుల్ సలాం, బిహార్‌కు చెందిన అజ్మనుల్లాఖాన్, ఢిల్లీకి చెందిన లక్కీ అహ్మద్, పశ్చిమబెంగాల్‌కు చెందిన మీర్ ఆసిఫ్ అలీ, రాజస్థాన్‌కు చెందిన జిషాన్, మహారాష్ట్రకు చెందిన షారుక్ ఖాన్, షేక్ ఫయాజ్ ఉర్ రెహ్మాన్, సహ మరికొందరు ఉన్నారు. బ్లాక్ పౌడర్, ఐఈడీల తయారీపై శిక్షణ మరోవైపు బ్లాక్ పౌడర్, ఐఈడీల తయారీకి సంబంధించిన వీడియోలు, ఫార్ములా డాక్యుమెంట్లు సైతం వీడియోల ద్వారా పంపించేవారు. వీటితో పేళుళ్లు, విధ్వంసం, ఎలా సృష్టించాలి అనే అంశాలపై పాకిస్తాన్ హ్యాండ్లర్లు ఈ గ్రూపులో ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేలా పోస్టులు చేసేవారు. అలాగే వీటితోపాటు ఆయుధాల వినియోగం, స్నీపర్ రైఫిల్స్ వాడకం తదితర అంశాలపై బెనెక్స్ కామ్ గ్రూపులోనే శిక్షణ అందించేవారు అని తెలుస్తోంది. సైబర్ దాడుల కుట్రకు శిక్షణ మరోవైపు తమ వెబ్ సైట్లు లేదా అకౌంట్లపై భారత ప్రభుత్వం దాడులు చేయకుండా ప్రత్యేక శిక్షణ ఇచ్చేవారని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ గుర్తించింది. అవసరమైతే భారత ప్రభుత్వ కీలక సంస్థలపై సైబర్ దాడులు చేయాలని… అధికారిక వెబ్ సైట్లు ఇతర సమాచారాన్ని హ్యాక్ చేయాలని విదేశీ హ్యాండ్లర్లు బెనెక్స్ కామ్ గ్రూప్ సభ్యులకు తెలియజేసేవారని ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నిర్ధారించింది. ఎన్ఐఏ చేతికి కేసు విజయవాడ ఉగ్రమూలాల కేసులో తీగ లాగితే డొంక కదిలినట్లు ఏకంగా అనేక కుట్ర కోణాలు బయటపడుతున్నాయి. విదేశీ హ్యాండ్లర్ల ప్రభావం అత్యధికంగా ఉండటం….యువతను ఖవాతీన్‌ వైపునకు ఆహ్వానించడం వంటి తీవ్రమైన నేరాల తీవ్రత ఉండటంతో ఈ కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏకు అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *