అక్షర ఆయుధం : గతంలో హిందువులైన వారు గల్ఫ్‌కు వెళ్లి అక్కడ ముస్లింలుగా మత మార్పిడి చేసుకున్నారు. అయితే ఇటీవలే వారు తిరుపతికి రావడంతో వారిని గుర్తించి భూమన హిందూమతంలోకి రావాలని మోటివేట్ చేసి మళ్లీ మత మార్పిడి చేశారు. ఈ మతమార్పిడి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది.టీటీడీ మాజీ చైర్మన్,మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మతంపై అనేక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం క్రిస్టియన్ కుటుంబం అని అతను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తారంటూ ప్రచారం జోరుగా సాగుతున్నసంగతి తెలిసిందే.అయితే తాను హిందువుగా పుట్టానని తాను ఆచరించేది హిందుత్వమేనని భూమన సమాధానం ఇచ్చుకుంటూ వస్తున్నారు. అయినప్పటికీ భూమన కరుణాకర్ రెడ్డి మతంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో భూమన కరుణాకర రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో మత మార్పిళ్లకు శ్రీకారం చుట్టారు. అయితే గతంలోలా కాకుండా ఇప్పుడు హిందువుల్లోకి మత మార్పిడి చేశారు. గతంలో హిందువులైన వారు గల్ఫ్‌కు వెళ్లి అక్కడ ముస్లింలుగా మత మార్పిడి చేసుకున్నారు. అయితే ఇటీవలే వారు తిరుపతికి రావడంతో వారిని గుర్తించి భూమన హిందూమతంలోకి రావాలని మోటివేట్ చేసి మళ్లీ మత మార్పిడి చేశారు. ఈ మతమార్పిడి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. 30 ఏళ్ల క్రితం మతం మారిన జంట శ్రీవేంకటేశ్వరస్వామి వారు కొలువుదీరిన తిరుపతిలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. టీటీడీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో ఆయన బాల్య స్నేహితుడు కుటుంబం సనాతన ధర్మాన్ని స్వీకరించింది. వివరాల్లో కి వెళ్తే తిరుపతికి చెందిన యాలమూరి శ్రీనివాస్‌రెడ్డి , పుష్ప దంపతులు సుమారు 30 ఏళ్ల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లి అక్కడ ముస్లిం మతాన్ని స్వీకరించారు. ఇస్లాం మతాన్ని స్వీకరించడం తో వారి పేర్లు కూడా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో వారి పేర్లు అబ్ధుల్లా, అమీనాగా మార్చు కున్నారు. యాలమూరి శ్రీనివాస్‌రెడ్డి , పుష్ప దంపతులు ఐదేళ్ల క్రితం తిరిగి స్వస్థలానికి చేరుకున్నారు. తిరుపతిలోని పీకే లే ఔట్‌తో నివాసం ఉంటున్నారు.రెండేళ్లుగా మతమార్పిడిపై ఒత్తిడి బాల్య స్నేహితుడు అయిన యలమూరి శ్రీనివాస్ రెడ్డి స్వస్థలానికి రావడంతో ఈ విషయం తెలుసుకున్న టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వారి ఇంటికి వెళ్లారు. తన స్నేహితుడు అయిన యలమూరి శ్రీనివాస్ రెడ్డి మతం మార్చుకున్నాడని గ్రహించారు. శ్రీనివాస్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరూ బాల్య స్నేహితులు కావడంతో తిరిగి హిందూ ధర్మంలోకి రావాలని ఆహ్వానించారు. గత రెండేళ్లుగా మతం మారాలంటూ పదేపదే ఒత్తిడి చేశారు. దీతో శ్రీనివాస్ రెడ్డి దంపతులు ఆలోచించి సనాతన ధర్మంలోకి తిరిగి రావాలని నిర్ణయించు కున్నారు. ఈ విషయాన్ని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డికి తెలియజేశారు. దీంతో భూమన కరుణాకర్ రెడ్డి పద్మావతిపురంలోని తన నివాసంలో ఈ క్రతువు నిర్వహించారు. స్నేహితుడు యలమూరి శ్రీనివాస్ రెడ్డి, పుష్ప దంపతులు భూమన కరుణాకర్ రెడ్డి నివాసంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించారు. యలమూరి శ్రీనివాస్ రెడ్డి దంపతులు మతం మారారు.
మతంమారిన జంట
ఇస్లాం నుంచి హిందూ ధర్మంలోకి ప్రవేశించడంపై యలమూరి శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కువైట్‌లో పరిస్థితుల వల్ల ఇస్లాం స్వీకరించాల్సి వచ్చింది అని చెప్పుకొచ్చారు. అయితే తన బాల్య స్నేహితుడు భూమన రెండేళ్లుగా తిరిగి హిందూ మతంలోకి రావాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన ప్రోత్సాహంతో ఇప్పుడు మనస్ఫూర్తిగా సొంత మతంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇకపై సగర్వంగా తిరుపతి కొండకు వెళతాను అని యలమూరి శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. మతం మారిన నేపథ్యంలో అబ్దుల్లా, అమ్మిన్నా అనే పేర్లను తిరిగి శ్రీనివాస్‌రెడ్డి, పుష్పగా మార్చుకుని మాతృధర్మంలోకి ప్రవేశించారు.భూమన వల్లే సొంతమతంలోకి వచ్చాను: యలమూరి శ్రీనివాస్ రెడ్డి ‘కువైట్‌లో పరిస్థితుల వల్ల ఇస్లాం స్వీకరించాల్సి వచ్చింది. నా బాల్య స్నేహితుడు అయిన భూమన కరుణాకర్ రెడ్డి రెండేళ్లుగా తిరిగి హిందూ మతంలోకి రావాలని ఒత్తిడి తెచ్చారు. ఆయన ప్రోత్సాహంతో ఇప్పుడు మనస్ఫూర్తిగా సొంత మతంలోకి రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఇకపై సగర్వంగా తిరుపతి కొండకు వెళతాను’అని యలమూరి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జగన్ ఆశయానికి అనుగుణంగా హిందూ ధర్మంలోకి:భూమన యలమూరి శ్రీనివాస్ రెడ్డి, తాను 50 ఏళ్లుగా స్నేహితులమని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు.‘గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ ఆదేశాలతో 60 మంది పీఠాధిపతులతో సదస్సు నిర్వహించాం. ఇతర మతాల్లోకి వెళ్లిన వారిని తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేయాలని ఆ సదస్సులో తీర్మానించాం’అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ నిర్ణయం అమలు కాలేదని…అయితే వైఎస్ జగన్ ఆశయానికి అనుగుణంగా తాను తన స్నేహితుడిని ఈ హిందూ ధర్మంలోకి తీసుకు రావడంతో సంతోషంగా ఉంది అని భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.