అమరావతిని రాజధానిగా బలోపేతం చేయడానికి అసెంబ్లీలో తీర్మానం

అక్షర ఆయుధం : రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తీర్మాణం ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాన్ని కేంద్రానికి, పార్లమెంట్‌కు ప్రభుత్వం పంపించనుంది.ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ శాశ్వత రాజధానిగా ‘అమరావతి’ని గుర్తించేలా చారిత్రాత్మక తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రాజధాని ‘అమరావతి’కి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు నాయుడు తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ‘అమరావతి’ని రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన, స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగటం అత్యవసరమని అభిప్రాయం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. రాజధానికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సీఎం తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 5(2)కు తగిన సవరణలు చేయటం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తించేలా తీర్మానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టారు. జగన్‌కు ఆత్మలతో మాట్లాడే అలవాటు ఉంది.శాసనమండలిలో అమరావతి చట్టబద్ధ తీర్మానం పెట్టాలంటున్న వైసీపీ ముందు శాసనసభకు రావాలి అని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఇంత ముఖ్యమైన కార్యక్రమం జరుగుతుంటే జగన్ బెంగుళూరు వెళ్లిపోవడం ఏమిటి అని ప్రశ్నించారు.‘జగన్‌కు ఆత్మతో మాట్లాడే అలవాటు ఉంది. రాత్రి ఆత్మ ఏం చెప్తే ఉదయాన్నే అది మాట్లాడుతాడు. బహుశా జూమ్‌ లో వస్తాడేమో ’ అంటూ మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు.వైఎస్ జగన్ పరామర్శలు పేరుతో వివాదాలు సృష్టిస్తున్నాడు అని మండిపడ్డారు. ‘శనివారం ఉదయం 11 గంటలకు సమావేశాలు పెట్టాం. ఆ 11 మంది ఎమ్మెల్యేలు సమావేశానికి వస్తే బాగుండేది. జగన్ పదేపదే సినిమా చూపిస్తా అంటున్నాడు. ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో జగన్‌కి సినిమా చూపిస్తేనే 11 సీట్లుకి పడిపోయారు’ అని మంత్రి నారా లోకేశ్ సెటైర్లు వేశారు.అసెంబ్లీ గురించి మాట్లాడే అర్హత సజ్జలకు లేదు2024 ఎన్నికల్లో ప్రజలు తుగ్లక్ పాలనకి చమర గీతం పాడారు అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. మళ్లీ అదే పాలన ప్రజలు వద్దనుకుంటున్నారని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. అసెంబ్లీ గురించి మాట్లాడడానికి సజ్జలకి ఏ అర్హత ఉంది అని ప్రశ్నించారు. ఆయనేమన్నా ఎమ్మెల్యేగా గెలిచాడా? అని ప్రశ్నించారు. మాట్లాడితే ఎమ్మెల్యేలు,మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడాలి. రాజధానిపై వైసీపీ స్టాండ్ ఏంటి అనేది ఇప్పటికీ చెప్పలేకపోతున్నారు అని మంత్రి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.అమరావతి చట్టబద్దతకు అన్ని పార్టీల మద్దతు‘పార్లమెంటులో అన్ని పార్టీలు అమరావతికి మద్దతిస్తాయి. ఇక్కడ వ్యతిరేకించేవాళ్లు అక్కడ మద్దతు ఇచ్చిన ఆశ్చర్యపోనవసరం లేదు’అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘గతంలో ముఖ్యమంత్రి పర్యటనలకు వెళ్తే.. పరదాలు కట్టడం , చెట్లు నరికేయడం చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఎక్కడా లేదు. ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. సీఎం ప్రోటోకాల్ మినహా అదనపు సిబ్బందిని వినియోగించడం లేదు’అని మంత్రి నారా లోకేశ్ చెప్పుకొచ్చారు. ‘గతంలో సీఎం కి బయటికి వెళ్తే.. వందల మందిని పోలీసులను పహారా పెట్టుకునే వాడు. గతంలో విజయ్ సాయి రెడ్డి వైజాగ్ వెళ్తే.. జామర్లు పెట్టుకుని గ్రీన్ ఛానల్ ఇచ్చారు. అమరావతికి చట్టబద్ధత ఒక్క రాజధాని రైతులకే కాదు.. రాష్ట్ర ప్రజలందరికీ గుడ్ న్యూస్’అని మంత్రి నారా లోకేశ్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *