“మనమంతా ఆంధ్రులమే”-అమరావతిపై డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలు

సాక్షి డిజిటల్ న్యూస్ : అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు, దీనికి కట్టుబడి ఉన్నాం. భాషాప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన రాష్ట్రమే రాజధాని లేకుండా తయారైంది. ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు, మనమంతా ఆంధ్రులం.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పామని, ప్రజలు అర్థం చేసుకుని కూటమిని గెలిపించారని….ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో అడుగు పడిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. అమరావతికి చట్టబద్దత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొని ప్రసంగించారు. అమరావతి రాజధాని కోసం మెజారిటీ శాతం రైతులు ఇష్టపూర్వకంగానే భూములు ఇచ్చారని స్పష్టం చేశారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మూడు రాజధానుల పేరిట సమస్యను జటిలం చేశారని తెలిపారు. గత ప్రభుత్వం భూములు ఇచ్చిన రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డిందని ఆరోపించారు.ప్రధాని నరేంద్రమోడీ మద్దతుతో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుస్థిర పాలన అందిస్తోందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ.. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన తీర్మానానికి మనసా, వాచా, కర్మణా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెల్లడించారు. వైసీపీ మళ్లీ రాదు వచ్చినా ఏం చేయలేదు ‘వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని సమస్యను పరిష్కరించకపోగా…కఠినతరం చేశారు. వైసీపీ మళ్లీ వస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. వైపీ మళ్లీ రాదు, వచ్చినా ఏం చేయలేదు. అమరావతి రైతుల కోసం మనందరం ఒకే మాటపై కట్టుబడి ఉండాలి’ అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ‘అమరావతిపై జనసేన ఎప్పుడూ మాట మార్చదు, దీనికి కట్టుబడి ఉన్నాం. భాషాప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికిన రాష్ట్రమే రాజధాని లేకుండా తయారైంది. ప్రాంతీయ విద్వేషాలు ఎందుకు, మనమంతా ఆంధ్రులం.’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సైబరాబాద్ క్రియేషన్ చంద్రబాబు నాయుడు ‘రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా ఇప్పటికి రాజధాని కోసం కొట్టుకుంటున్నాం. తెలంగాణ వేరు, ఆంధ్రా వేరు అనే భావన నాకు లేదు..తెలుగునేల అనే భావన ఉండేది’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏపీ నేలపై ప్రేమతోనే ఎలాంటి షరతులు లేకుండా టీడీపీతో కలిశా అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ‘ఒక పొలిటికల్ లీడర్.. రాబోయే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు. ఒక విజనరీ ఉన్న నాయకుడు… రాబోయే తరం కోసం ఆలోచిస్తాడు.మనసీఎం చంద్రబాబు మంచి విజనరీ ఉన్న నాయకుడు’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు.‘నేను తిరిగిన మాదాపూర్‌లో, ట్రెక్కింగ్ వెళ్లిన కొండ‌ల్లో… నేను చూస్తుండ‌గా హైద‌రాబాద్ రూపు రేఖ‌లు మారిపోయాయి. ఇంత పెద్ద రోడ్లు ఎందుకు అనుకున్నాను. ఒక విజ‌న‌రీ ఉన్న నాయ‌కుడు వ‌చ్చే త‌రం కోసం ఆలోచిస్తారు. అంత‌టి దార్శ‌నిక‌త ఉన్న నాయ‌కుడు చంద్ర‌బాబు. సైబ‌రాబాద్ చంద్ర‌బాబు క్రియేష‌న్’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు.రాజధాని కోసం కొట్టుకోవడం బాధేస్తోంది భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం అమర జీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితం వల్ల ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైంది అని డిప్యూటీ సీఎం అన్నారు. రాష్ట్రం ఏర్పడి ఇన్నేళ్లయినా ఇప్పటికీ రాజధాని కోసం కొట్టుకుంటున్నామని… ఇప్పటికీ రాజధాని, సరైన హైకోర్టు లేదని తలుచుకుంటే బాధేస్తోంది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘రాజకీయ స్థిరత్వం చాలా ముఖ్యం. తెలంగాణ వేరు, ఆంధ్ర వేరు అనే భావన లేదు తెలుగునేల అనే భావన ఉండేది. రాష్ట్రాన్ని విభజించేటప్పుడు కాంగ్రెస్ బాధ్యతగా వ్యవహరించలేదు. రాష్ట్రం ఏర్పడే నాటికి సరైన కార్యాలయాలు లేవు. చంద్రబాబు బలమైన ఆశావాది కాబట్టి, కార్యాలయాలు లేకపోయినా పనిచేశారు. టెంట్ వేసుకొని అయినా పని చేద్దామని చంద్రబాబు ఆశించారు’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఉన్న గౌరవం వల్లే 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చాను. చంద్రబాబు లాంటి వ్యక్తి చేతిలో ఏపీ ఉంటే బాగుంటుందని మద్దతు ఇచ్చాను అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. అమరావతి ఏపీకి ఏకైక రాజధాని అని అప్పుడే చెప్పాం ‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతిపై కక్ష గట్టిన జగన్ మహిళల్ని రోడ్లపైకి ఈడ్చారు.మహిళలకు మద్దతుగా అమరావతి వెళ్తే ముళ్ల కంచెలు వేసి అడ్డుకున్నారు’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. అప్పట్లో అమరావతి చాలా ఆందోళనగా ఉండేదని గుర్తు చేశారు. చట్టసభలోని సభ్యులకే రక్షణ లేకపోతే బయటి ప్రజల పరిస్థితి గురించి ఏం చెబుతామని అన్నారు. జగన్ చేసిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని… అమరావతి ఏపీకి ఏకైక రాజధానిగా ఉంటుందని చెప్పామని, ప్రజలు అర్థం చేసుకుని కూటమిని గెలిపించారని….ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకునే క్రమంలో అడుగు పడిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. చట్టసభలో ఇచ్చేది కేవలం హామీ కాదని, చిత్తశుద్ధితో అమలు చేయాల్సిందేనని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నేరమయరాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం ‘నేరమయ రాజకీయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదు. అప్పుడే ఏపీకి పెట్టుబడులు బలంగా వస్తాయి’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజధాని కోసం భూమి ఇచ్చిన చిన్న రైతులతో పాటు మిట్టల్ వంటి పారిశ్రామికవేత్తలు కూడా స్థిరత్వం అడుగుతున్నారని…మనం ఐక్యంగా ఉంటేనే ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుంది అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గట్టిగా చెప్పారు. మనం ప్రాంతీయ భావనలు పక్కన పెట్టి ఆంధ్రా అని చెప్పుకుందామని, ఒకటే నేల, ఒకటే రాష్ట్రం, ఒకటే జాతి అని బలంగా చెప్పాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *