ఏపీలో గ్రామపంచాయతీల పునర్వ్యవస్థీకరణకు గ్రీన్ సిగ్నల్…

కొత్తగా ‘రూర్బన్ పంచాయతీలు’ ఏర్పాటు!

అక్షర ఆయుధం: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సరికొత్త సంస్కరణలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుటి వరకు ఉన్న 3 పంచాయతీలను నాలుగు పంచాయతీలకు పెంచింది. జనాభా 10 వేలకు పైగా ఉంటే రూర్బన్ పంచాయతీగా గుర్తింపు ఇచ్చింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సరికొత్త సంస్కరణలు చేపట్టింది. దీని ప్రకారం గ్రామ పంచాయతీలను జనాభా మరియు ఆదాయానికి ఆధారంగా నాలుగు వర్గాలుగా పునర్వర్గీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మూడు రకాల పంచాయతీలు ఉన్నాయి .అయితే కొత్తగా ప్రవేశపెట్టిన రూర్బన్ పంచాయతీని ఏర్పాటు చేయనున్నారు. దీంతో మొత్తం నాలుగు రకాల పంచాయతీలు ఉండనున్నాయి. 10వేల జనాభా దాటితే రూర్బన్ పంచాయతీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్ వ్యవస్థీకరణకు శ్రీకారం చుట్టింది. నాలుగు పంచాయతీలుగా చేసింది. కొత్తగా రూర్బన్ పంచాయతీని ఏర్పాటు చేసింది. ఈ రూర్బన్ పంచాయతీలకు 10,000 కంటే ఎక్కువ జనాభా ఉండాలి మరియు వార్షిక ఆదాయం రూ.1 కోటికి మించి ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో జనాభా 5,000 కంటే ఎక్కువ ఉండాలి. ఇక గ్రేడ్-1 పంచాయతీలకు 3,000 నుండి 10,000 మధ్య జనాభా ఉండాలి. వార్షిక ఆదాయం రూ. 30 లక్షల కంటే ఎక్కువ కానీ రూ. 1 కోటికి తక్కువగా ఉండాలి. అదే గిరిజన ప్రాంతాల్లో అయితే జనాభా 2,500 నుండి 5,000 మధ్య ఉండాలి. గ్రేడ్-2 పంచాయతీలకు 2,000 కంటే తక్కువ జనాభా ఉండాలి. గిరిజన ప్రాంతాల్లో 1,500 నుండి 2,000 మధ్య ఉండాలి. గ్రేడ్-3 పంచాయతీలకు 1,500 కంటే తక్కువ జనాభా ఉండాలి.పట్టణ తరహా సదుపాయాలు కల్పించడమే లక్ష్యం ఇటీవల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల వర్గీకరణకు సంబంధించిన సమీక్షలో ఈ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచాయతీల పునర్ వ్యవస్థీకరణకు ఆదేశించారు. దీని ప్రకారం అధికారుల కమిటీ ఒక నివేదిక తయారు చేసి పంచాయతీల పునర్‌ వర్గీకరణ ప్రతిపాదనను రూపొందించింది. ఇప్పుడు ఆ ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గ్రామ పంచాయతీల పునర్‌ వర్గీకరణలో కొత్త మార్పులు తీసుకువచ్చింది. తద్వారా పట్టణ తరహా సదుపాయాలను అందించేందుకు ప్రణాళికలు రూపొందించ బడనున్నాయి. ముఖ్యమైన సమాచారం ఏపీలో గ్రామపంచాయతీల పునర్‌ వ్యవస్థీకరణ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సరికొత్త సంస్కరణలు. జనాభా 10 వేలకు పైగా ఉంటే రూర్బన్ పంచాయతీగా గుర్తింపు. జనాభా 3 వేల కంటే ఎక్కువ, 10 వేల కంటే తక్కువగా ఉంటే గ్రేడ్-1 పంచాయతీ.జనాభా 2 వేల కంటే తక్కువగా ఉంటే గ్రేడ్-2 పంచాయతీలుగా గుర్తింపు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *