ఏపీ ప్రభుత్వం మరో కీలక అడుగు

లక్షల ఇళ్ల గృహప్రవేశం నేడు

అక్షర ఆయుధం ; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించనుంది.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. కూటమి ప్రభుత్వం రెండో విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా సోమవారం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.5 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించనుంది. ఇందులో లక్ష టిడ్కో ఇళ్లతోపాటు కాలనీల్ల పూర్తైన మరో 1.50 లక్షల గృహాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పుదూరులో జరిగే సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొంటారు. అదే సమయంలో రాష్ట్రంలో మొత్తం 2.5 లక్షల ఇళ్లకు గృహప్రవేశాలు నిర్వహించనున్నారు. ప్రతీ ఒక్కరికీ సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తోన్న రాష్ట్రంలో ప్రభుత్వం మరోసారి సామూహిక గృహప్రవేశాల ద్వారా పేదలకు ఇళ్ల పంపిణీ చేపడుందని కూటమి నేతలు తెలిపారు.ఇక, ప్రభుత్వ వర్గాల ప్రకారం… రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక ఈ 21 నెలలో రెండోసారి ప్రభుత్వం ఇళ్ల పంపిణీ చేస్తోంది. గతేడాది నవంబర్‌లో రాయచోటి నుంచి 3 లక్షల ఇళ్లను పూర్తిచేసి రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు అప్పగించింది. రెండో విడతలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడపేట మండలం పుదూరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష టిడ్కో ఇళ్లతో పాటు మరో 1.50 లక్షల ఇళ్లను లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అందించనున్నారు.ఈ కార్యక్రమం అనంతరం పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమం మొదలుపెట్టి ఏడాదవుతున్న సందర్భంగా తిరుపతిలో నిర్వహించే వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు పర్యటన షెడ్యూల్…ఇందుకోసం సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం ఉదయం 10 గంటలకు అమరావతి నుంచి బయలుదేరి 11.50 గంటలకు పుదూరుకు చేరుకుంటారు. ఉదయం 11.55 గంటలకు లబ్ధిదారులతో టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాలు చేయిస్తారు. అనంతరం లబ్ధిదారులతో ముఖ్యమంత్రి ముచ్చటిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12.40 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.40 గంటలకు సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు, నేతలతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం 4.35 గంటలకు తిరుపతి చేరుకుంటారు. 04.45 గంటలకు శ్రీపద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలోని ఇందిరా ప్రియదర్శిన ఆడిటోరియంలో నిర్వహించే పీ4 వార్షికోత్సవ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం ముగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు రాత్రి 8.50 గంటలకు అమరావతి చేరుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *