రేవంత్ రెడ్డికి హరీశ్ రావు ఓపెన్ ఛాలెంజ్!

సిద్దిపేటలో పోటీకి రావాలని సవాల్

అక్షర ఆయుధం : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీమంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ సీఎం కాలేరని అన్నారు. మళ్లీ సీఎం అవుతానని రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నారని…సిద్దిపేటలో ఎవరో ఎందుకు.. రేవంత్ పోటీ చేయాలి అని మండిపడ్డారు. నేనే స్వయంగా ఆహ్వానిస్తున్నా అని మాజీమంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిద్దిపేటలో తనపై పోటీ చేయాలి అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు ఛాలెంజ్ విసిరారు. ఇటీవలే సిద్దిపేటలో గెలుపొందిన వారికి మంత్రి పదవి ఇస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్ ఇవ్వడంపై హరీశ్ రావు స్పందించారు. తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ రేవంత్ రెడ్డి సీఎం కాలేరు అని చెప్పుకొచ్చారు. మళ్లీ సీఎం అవుతానని పగటికలలు కంటున్నారు అని మండిపడ్డారు. సిద్ధిపేటలో ఎవరో ఎందుకు రేవంత్ రెడ్డి పోటీ చేయాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డిని తనపై పోటీ చేయాలంటూ తానే స్వయంగా ఆహ్వానిస్తున్నట్లు మాజీమంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు.దమ్ముంటే సిద్ధిపేటలో పోటీ చేయాలి. “వాళ్ళు వీళ్ళు ఎందుకు..? రేవంత్ రెడ్డికి దమ్ముంటే సిద్దిపేటలో నాపై పోటీకి రావాలి” అని మాజీమంత్రి హరీశ్ రావు ఛాలెంజ్ విసిరారు. రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతానని పగటి కలలు కంటున్నారని, ఆయన తల్లకిందులుగా తపస్సు చేసినా అది సాధ్యం కాదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డికి ఇదే ఆఖరి టర్మ్ అని, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం ఖాయమని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పుకొచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో పాటు రైతులను కూడా రేవంత్ రెడ్డి మోసం చేశారని ధ్వజమెత్తారు. హామీలను అమలు చేయడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు.గోల్ ఎలా కొట్టాలో మాకు బాగా తెలుసు కాంగ్రెస్ పాలన, రాబోయే ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన అంశాలపై మాజీమంత్రి హరీశ్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటామని హరీశ్ రావు అన్నారు. రాజకీయాల్లో ఎప్పుడు, ఎలా గోల్ కొట్టాలో తమకు బాగా తెలుసని, సమయం వచ్చినప్పుడు తమ సత్తా చాటుతామని మాజీమంత్రి హరీశ్ రావు చెప్పుకొచ్చారు. మరోవైపు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లను బీఆర్ఎస్ పక్షాన తాము స్వాగతిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల బీఆర్ఎస్ పార్టీకే మేలు జరుగుతుందని విశ్లేషించారు. అయితే కుటుంబ నియంత్రణను పాటించినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఆర్థికంగా, రాజకీయంగా నష్టం జరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారంపై స్పందించారు.జీవన్ రెడ్డి వస్తారో లేదో చూడటమే బాగుంటుంది…. ఇప్పుడే చెప్పడం కంటే వేచి చూడటం ఉత్తమం అంటూ మాజీమంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. సిద్ధిపేట నుంచి గెలిస్తే ఏకంగా మంత్రి పదవి ఇస్తా: సీఎం రేవంత్ రెడ్డి ఆఫర్ సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కాక పుట్టించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిద్ధిపేట వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి…అనంతరం రైతు భరోసా పథకం అమలును సైతం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంపై తన వ్యూహాన్ని బయటపెట్టారు. 1985 నుంచి సిద్దిపేటలో ఒకే కుటుంబం (సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కుటుంబం) సాగిస్తున్న ఆధిపత్యానికి 2029లో తెరపడనుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే, ఆ గెలిచిన వ్యక్తిని నేరుగా తన కేబినెట్‌లోకి తీసుకుని మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *