రాహుల్ గాంధీకి రూ.1000 కోట్లు కేటాయింపుపై విమర్శలు

అసెంబ్లీలో ప్రశ్నిస్తామని కేటీఆర్

జనం న్యూస్: తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దానిమీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీస్తాం, నిలదీస్తాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ‘తెలంగాణను ఒక ఏటీఎం గా మార్చి ఏఐసీసీకి సమర్పించుకునే దానిమీద ఉన్న శ్రద్ధ ఈ రాష్ట్రంలోని పేదల మీద లేదు అనేది తప్పకుండా రాష్ట్రంలోని ప్రతి పేదవాడి తరపున ఈ ప్రభుత్వాన్ని నిగ్గదీస్తాం, నిలదీస్తాం’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని…అందులో ముఖ్యంగా రాహుల్ గాంధీ తాము రాష్ట్ర ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి క్యాబినెట్‌లోనే ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇంతవరకు చట్టబద్ధత కల్పించలేనన్న మాట వాస్తవం’అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలప్రారంభోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించారు. ఎవరి త్యాగాల వల్లనైతే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో వారి స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, వారి త్యాగాలకు మరొక్కసారి ప్రణమిల్లుతూ నివాళులర్పించారు. తెలంగాణ అమరవీరులకు, విద్యార్థి అమరవీరులకు నివాళులర్పించి ఇవాళ శాసనసభ సమావేశాలకు హాజరు కాబోతున్నాం అని కేటీఆర్ అన్నారు. రాహుల్ బంధు కాదు రైతు బంధు వేయండి. ఆరు గ్యారంటీలపై తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మొట్టమొదటి గవర్నర్ ప్రసంగంలోనే ఆనాడే రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ముఖ్యమంత్రి సంతకం పెట్టారు.ఇంకా అప్పుడు గవర్నర్ తమిళసై సౌందరరాజన్‌ నోటమ్మట చెప్పించారు అని కేటీఆర్ గుర్తు చేశారు. ‘రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చట్టబద్ధత కల్పిస్తదని చెప్పి వారు ఆనాడు చెప్పినప్పటికీ ఇప్పటికీ రెండున్నర సంవత్సరాలు అయ్యంది. ఇది మూడో గవర్నర్ ప్రసంగం. ఇంతవరకు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత లేదు.పంటలు నాట్లు వేసేటప్పుడు నిజానికి కేసీఆర్ గారి టైంలో రైతుబంధు పడేది. కానీ ఇవాళ పంటలు కోతలకు వచ్చినా రైతుబంధు దిక్కులేదు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత, ఒక సమాధానం లేదు. అందుకే ‘రాహుల్ బంధు కాదు, రైతుబంధు వేయండి’, ‘రాహుల్ కు 1000 కోట్లు, రైతులకు వెన్నుపోట్లా’ అని చెప్పి ఈ సభా సమావేశాల్లోనే బడ్జెట్ సమావేశంలో తప్పకుండా నిలదీస్తాం’అని కేటీఆర్ హెచ్చరించారు. 2లక్షల ఉద్యోగాల ఊసే లేదు. ‘అన్ని వర్గాలకు హామీలిచ్చి మోసం చేసిన ప్రభుత్వం ఇది. బలహీన వర్గాలకు లక్ష కోట్ల బడ్జెట్ అన్నారు. ఐదేళ్లలో మరి రెండు బడ్జెట్లు అయిపోయినవి, ఇది మూడో బడ్జెట్. ఈపాటికే 60 వేల కోట్లు పెట్టి ఉండాలి. మరి ఇంతవరకు దానిమీద కూడా స్పష్టత లేదు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ‘అట్లాగే ఎస్సీ ఎస్టీలకు అంబేద్కర్ అభయహస్తం ప్రవేశపెడతామన్నారు. మరి రూ.12 లక్షలు ఇస్తామన్నారు. దళితబంధు స్థానంలో, ఇంతవరకు అదీ అతీగతీ లేదు. రెండు లక్షల ఉద్యోగాల ఊసే లేదు. ఇతర వర్గాలకు 10 వేల ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. అట్లాగే ఆరు గ్యారెంటీలకు అయితే మంగళం పాడినట్టే కనబడుతున్నది’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జాబ్ క్యాలెండర్ ఇంకెప్పుడు?. ‘మహిళలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర వేలు 100 రోజుల్లో ఇస్తామన్నారు ఎప్పటి నుంచి ఇస్తారని. ముసలివాళ్లు ఎదురుచూస్తున్నారు పెద్దమనుషులు రూ.4 వేల పెన్షన్లు ఎప్పటినుంచి వస్తాయని. రైతులు రైతుభరోసా కోసం, రైతుబంధు కోసం ఎదురుచూస్తా ఉన్నారు. రైతు కూలీలు నెలకి ఇస్తానన్న వెయ్యి రూపాయల కోసం ఎదురుచూస్తా ఉన్నారు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.‘ఆటో అన్నలు ఎదురుచూస్తా ఉన్నారు వెయ్యి రూపాయల కోసం.ముఖ్యంగా తెలంగాణ విద్యార్థులు 10 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఏదైతే గవర్నమెంట్ చెల్లించాలో వాటి విషయంలో కూడా మొత్తం విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ అన్ని విషయాల్లో ఉద్యోగ జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇంతవరకు ఆ క్యాలెండర్ లో మరి కొత్త క్యాలెండర్ ఉందే తప్ప జాబ్స్ అయితే కనబడట్లేదు’బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *