టీడీపీకి కొత్త తలనొప్పి

ఆ ఎంపీని సీఎం చంద్రబాబు సస్పెండ్ చేస్తారా?

సాక్షి డిజిటల్ న్యూస్ : హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. హైదరాబాద్ శివారు మొయినాబాద్‌లోని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందిన ఫామ్‌హౌస్‌లో డ్రగ్స్ పార్టీ ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. ఈ పార్టీలో పాల్గొన్నవారిలో ఆరుగురికి డ్రగ్స్ పాజిటివ్‌గా రాగా… అందులో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కూడా ఉన్నారు. దీంతో ఏపీలో కూటమి ప్రత్యర్థి పార్టీల చేతిక విమర్శనాస్త్రం దొరికింది. ఇప్పటికే టీడీపీ టార్గెట్‌గా వైసీపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీ అని పేరు మార్చాల్సిన పరిస్థితి వచ్చిందని వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు. సాక్షాత్తు ఏలూరు టీడీపీ ఎంపీ పుట్ట మహేష్ డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు దొరకడం మన రాష్ట్ర ప్రజలకు సిగ్గు చేటని మండిపడుతున్నారు. పుట్టా మహేష్ కుమార్‌కు ఎంపీగా కొనసాగే అర్హత లేదని వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబుకు దమ్ముంటే… పుట్టా మహేష్ కుమార్‌ను టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఎంపీ మహేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘‘మొయినాబాద్ డ్రగ్స్ పార్టీలో ఏలూరు టీడీపీ ఎంపీ దొరకడం సిగ్గుచేటు. ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంటే ఈ ఎంపీ ఇక్కడ కొకైన్ తో విందు చిందు చేస్తున్నాడు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇదెక్కడి భాద్యతారాహిత్యం ? డ్రగ్స్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చింది కదా… ఇప్పుడు చంద్రబాబు ఏం చర్యలు తీసుకుంటారు ? డ్రగ్స్ తీసుకుంటూ పట్టబడ్డ ఎంపీ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాడు ? యువత డ్రగ్స్ వాడాలని నేరుగా ఎంపీ ఎంకరేజ్ చేస్తున్నారా? . ఓట్లేసి గెలిపించిన ఏలూరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు ? ఎంపీగా పుట్టా మహేష్ పై అనర్హత వేటు వేయాలి. పార్టీ నుంచి వెంటనే సస్పెన్షన్ విధించాలి. డ్రగ్స్ వాడకంపై నిజంగా కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపితే ఏలూరు ఎంపీపై చర్యలు తీసుకొని చంద్రబాబు చిత్తశుద్ధి నిరూపించుకోవాలి’’ అని షర్మిల డిమాండ్ చేశారు. ప్రత్యర్థి పార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఈ వ్యవహారం టీడీపీకి తలనొప్పిగా మారింది. దీంతో ఈ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. గతంలో అవినీతి ఆరోపణలు, నేరారోపణలు ఎదుర్కొన్న టీడీపీ నేతలపై చర్యలు తీసుకున్న చరిత్ర సీఎం చంద్రబాబుకు ఉంది. ఈ నేపథ్యంలో పుట్టా మహేష్ కుమార్‌పై కూడా టీడీపీ చర్యలు తీసుకునే అవకాశం ఉందనే వాదన వినిపిస్తుంది. ఎందుకంటే… డ్రగ్స్ పార్టీ చేస్తున్న చోట పుట్ట మహేష్ కుమార్ ఉండటం, బ్లడ్ టెస్టులో ఆయనకు డ్రగ్స్ పాజిటివ్‌గా రావడంపై టీడీపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. పుట్టా మహేష్ వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఇప్పటికే ఆరా తీసింది. ఇంటెలిజెన్స్ ద్వారా వివరాలు సేకరించే పనిలో పడింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డితో ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌కు సంబంధాలపై టీడీపీ అధిష్టానం ఆరా తీస్తుంది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ప్రాథమిక సమాచారాన్ని పార్టీ నేతలు టీడీపీ అధిష్టానానికి అందించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే పుట్టా మహేష్‌పై సీఎం చంద్రబాబు నాయుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అనేది ఉత్కంఠగా మారింది. పుట్టా మహేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా?, ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపుతారా? అనేది చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *