ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి

*ప్రమాదంపై మంత్రి ఆరా

అక్షర ఆయుధం పీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వెళ్తున్న కారు లారీని వెనుకవైపు నుంచి వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా బెంగళూరుకు చెందిన వారుగా పోలీసులు నిర్ధారించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తుండగా ఈ ప్రరమాదం జరిగిందని తెలుస్తోంది. చిత్తూరు జిల్లా పలమనేరు బైపాస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన వారుగా తెలుస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు బెంగళూరు నుంచి తిరుమల వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది అని తెలుస్తోంది. యాక్సిడెంట్‌ గురించి తెలుసుకున్న పలమనేరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం వైఎస్ఆర్ జంక్షన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంపై ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. ప్రమాద కారణాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *