గూగుల్‌తో పోల్చిన అభివృద్ధి, గొడ్డలితో ప్రతిపక్షం: నారా లోకేశ్

అభివృద్ధి పై లోకేశ్ కీలక వ్యాఖ్యలు

పయనించే సూర్యుడు న్యూస్ : విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ అంటే కొత్త చరిత్రకు పునాది వేసిన పవిత్రమైన రోజుది. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటి నుంచి మరో లెక్క. ఇప్పటి నుంచి విశాఖను డేటా ఏఐ హబ్‌గా పిలుచుకోబోతున్నాం. ఇక నుంచి గ్లోబల్‌ ఐటీ మ్యాప్‌లో విశాఖ అనే పవిత్ర పట్టణం ఉండబోతోంది’అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు పనితీరును అందుకోవడం ఎవరితరం కాదు. నేనూ, రామ్మోహన్ నాయుడు కూడా ఆయన స్పీడ్ అందుకోలేం’అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘గూగుల్‌తో భారత్‌లోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి విశాఖకు వచ్చింది. ఈ డేటా సెంటర్ ఏర్పాటులో అదానీ కనెక్స్ , ఎయిర్ టెల్ నెక్స్ ట్రా సహకారం అందించాయి’అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఈ ప్రాజెక్టుకు భూములు ఇచ్చిన రైతులకు, యువతకు మంత్రి నారా లోకేశ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన అనంతరం ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రసంగించారు.‘ఈ రోజు నుంచి విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఓ చరిత్రను సృష్టిస్తోంది. ఉక్కు నగరంగా పేరు పొందిన విశాఖ ఇక డేటా సిటీ అవుతుంది. ఏఐ డేటా సెంటర్‌తో గ్లోబల్ ఐటీ మ్యాప్‌లోకి విశాఖ గూగుల్ వచ్చి చేరింది. 2019-24 మధ్య రాష్ట్రంలో విధ్వంసం జరిగింది. దానిని పునరుద్ధరిస్తూ ప్రజలు కూటమి ప్రజాప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు’అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఏపీకి 25శాతం మేర పెట్టుబడులు ‘సైబరాబాద్‌ను హైటెక్ సిటిగా మార్చిన ట్రాక్ రికార్డు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఉంది. ఆర్సెలార్ మిట్టల్, గూగుల్ లాంటి ప్రాజెక్టులు వేగంగా పెట్టుబడులు వస్తున్నాయనటానికి ప్రత్యక్ష ఉదాహరణ అదే. దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్, ఏపీలో డబుల్ ఇంజన్ బులెట్ ట్రైన్ సర్కార్లతో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సాకారం అవుతోంది’అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘ప్రధాని మోడీ సహకారంతో దేశంలోనే 25 శాతం మేర పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ప్రపంచం గతంలో చూడని నవ భారతం ఈ టెక్ ప్రాజెక్టుతో సాకారం అవుతోంది. సైబరాబాద్ నిర్మాణం అంతా చూశాం. ఇప్పుడు విశాఖలోని ఏఐ డేటా సెంటర్‌తో కొత్త ట్రాజెక్టరీ ఆవిష్కృతం అయ్యింది’అని మంత్రి నారా లోకేశ్ అభిప్రాయపడ్డారు. ‘రూ.1.35 లక్షల కోట్ల పెట్టుబడితో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయి. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, మెకానికల్ సహా వివిధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు అవుతాయి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని విధానం ప్రజాప్రభుత్వానిది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మా నినాదం’అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ‘క్లస్టర్ బేస్డ్ అభివృద్ధితో రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నాం, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమలో వేర్వేరు రంగాల్లో పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది’అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. గూగుల్ క్రెడిట్ తీసుకునేందుకు సీసీడీ రోగి ప్రయత్నం ‘ప్రజా ప్రభుత్వానిది గూగుల్ అయితే వైసీపీ పార్టీది గొడ్డలి. కొందరు కేసులు వేసి ఇబ్బందులు పెట్టేందుకు ప్రయత్నించారు. గూగుల్ క్రెడిట్ కూడా తీసుకునేందుకు సీసీడీ రోగి ప్రయత్నిస్తారు’అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ మండిపడ్డారు. ‘ఆంధ్రప్రదేశ్ పై విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టినందుకు గూగుల్ కు ధన్యవాదాలు. అదానీ, ఎయిర్ టెల్ సంస్థలకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం. మొదటి ట్రిలియన్ డాలర్ ఎకనామిక్ రీజియన్‌గా విశాఖ ప్రాంతాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది’అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. వైజాగ్‌లో Gఅంటే గూగుల్ ఈ రోజుతో విశాఖ ముఖచిత్రం మారబోతుంది. ఇకపై విశాఖ అంటే… డేటా ఏఐ సెంటర్.. ఏపీ అభివృద్ధిలో పాలుపంచుకొంటున్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు. ఏపీలో విధానపరమైన స్పష్టత, వేగం ఉంటాయి. వైజాగ్‌లో G అంటే గూగుల్. ఇప్పటివరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క… ఏపీ ప్రభుత్వం దూరదృష్టితో ఆలోచిస్తుంది’అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ‘ఐదేళ్లలో విధ్వంస పాలన చూశాం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వ్యాపారులు భయపడ్డారు. అధికారంలోకి రాగానే పెట్టుబడుల కోసం ప్రయత్నించాం. విజనరీ లీడర్‌షిప్ గురించి చెప్పి.. .పెట్టుబడిదారులు ఏపీకి వచ్చేందుకు ఒప్పించాం. నమో అంటే నాయుడు, మోడీ. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ప్రయోజనాలు చూపిస్తున్నాం. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని.. అదే అమరావతి’అని ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *