ఎమ్మెల్సీల నియామకాలపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

అజారుద్దీన్ మంత్రి పదవి యథాతథం

సాక్షి డిజిటల్ న్యూస్: తెలంగాణ గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీల భర్తీకి లైన్ క్లియర్ అయ్యింది. మంత్రి అజారుద్దీన్, ప్రొ.కోదండరామ్‌లను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వీరు ఎమ్మెల్సీలుగా నామినేట్ అవ్వనున్నారు. దీంతో అజారుద్దీన్‌కు మంత్రి పదవి సేఫ్ జోన్‌లో ఉంది. తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ఉత్కంఠకు తెరపడింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలను ప్రభుత్వం భర్తీ చేసింది. రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం. కోదండరాంలను గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదివారం నామినేట్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. గతంలో రాజకీయ కారణాల వల్ల ఈ ఎమ్మెల్సీల నియామకంపై న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పటికీ, ప్రస్తుత నియామకాలతో ప్రభుత్వం ఆ స్థానాలను అధికారికంగా భర్తీ చేసింది. 2023 నుంచి భర్తీ కావాల్సిన స్థానాలు తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎన్నికైన డి.రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల పదవీకాలం 2023 మే 27న ముగిసింది. దీంతో ఆ రెండు స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది.నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను నామినేట్ చేసింది. దీంతో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నియామకంపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆ స్థానాల భర్తీ పెండింగ్‌లో పడిపోయింది.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహమ్మద్ అజారుద్దీన్‌, కోదండరాం పేర్లను రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నియామకాలపై మళ్లీ స్టే పడింది. అయితే మహమ్మద్ అజారుద్దీన్ కేబినెట్‌లో కొనసాగుతుండటంతో ఎమ్మెల్సీ అవ్వడం తప్పనిసరి. ఏప్రిల్ 30లోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది.ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో సంప్రదింపులు జరపవచ్చు అని సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 19న గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లాను కలిసి నియామకాలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలో ఈ నియామకాలకు మార్గం సుగమమైంది.ఇకపోతే తెలంగాణ మంత్రి అజారుద్దీన్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం ఎమ్మెల్సీ‌ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల అంశంపై చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ అంశం వివిధ ములుపులు తిరిగిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఆగస్టులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్‌ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటాలో అజారుద్దీన్‌, ప్రొఫెసర్‌ కోదండరాం‌ పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అప్పటి నుంచి ఆ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది. గతేడాది అక్టోబర్ 31న మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం అయితే అజారుద్దీన్ గతేడాది అక్టోబర్ 31న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అటు శాసనసభలో, ఇటు శాసనమండలిలో సభ్యుడు కాకపోయినప్పటికీ మంత్రిగా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం… ఎవరైనా ఏ సభలో సభ్యులుగా లేకుండా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపడితే, ఆరు నెలలు పూర్తి కాకముందే ఏదో ఒక సభలో సభ్యులు కావాల్సి ఉంటుందనే సంగతి తెలసిందే. అయితే అజారుద్దీన్ మంత్రి మంత్రి పదవి చేపట్టి ఈ నెలాఖరుకు ఆరు నెలలు పూర్తి కానుంది. దీంతో ఈ నెలాఖరులోపు ఏదో ఒక సభలో సభ్యుడు కావాల్సిన అవసరం ఉంది. అయితే ఈలోపే గవర్నర్ శివ పత్రాప్ శుక్లా తన వద్ద పెండింగ్‌లో ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఫైల్‌కు ఆమోద ముద్ర లభించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *