ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్ ప్రమాణం

మంత్రి పదవికి గ్రీన్ సిగ్నల్

అక్షర ఆయుధం ; తెలంగాణ ఎమ్మెల్సీలుగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొ.కోదండరామ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇరువురితో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, పీసీసీ చీప్ మహేశ్ గకుమార్ గౌడ్ పలువురు మంత్రులు ఇతర కీలక నేతలు హాజరయ్యారు.తెలంగాణ ఎమ్మెల్సీలుగా మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొ.కోదండరామ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఇరువురితో ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, పీసీసీ చీప్ మహేశ్ గకుమార్ గౌడ్ పలువురు మంత్రులు ఇతర కీలక నేతలు హాజరయ్యారు.గత కొంత కాలంగా తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.అయితే ఇదే కోటాలో రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్‍ల నియామకానికి గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం వారి నియామకంపై ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో మహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవికి ఎలాంటి ఢోకాలేనట్లు అయ్యింది. ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరామ్‌ల ప్రమాణ స్వీకారం తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, ప్రొఫెసర్ ఎం.కోదండరాంలు ప్రమాణ స్వీకారం చేశారు.గవర్నర్ కోటాలో శాసనమండలి సభ్యులుగా గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదివారం నామినేట్ చేయడం ఆ తర్వాత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నియామకాలు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల తుది తీర్పునకు లోబడి ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. గతంలో రాజకీయ కారణాల వల్ల ఈ ఎమ్మెల్సీల నియామకంపై న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పటికీ, ప్రస్తుత నియామకాలతో ప్రభుత్వం ఆ స్థానాలను అధికారికంగా భర్తీ చేసింది. తాజాగా సోమవారం ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, ప్రొఫెసర్ కోదండరామ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. 2023 నుంచి భర్తీ కావాల్సి ఉంది. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎన్నికైన డి.రాజేశ్వర్ రావు, ఫారూఖ్ హుస్సేన్‌ల పదవీకాలం 2023 మే 27న ముగిసింది. దీంతో ఆ రెండు స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉంది.నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్ కుమార్, కుర్రా సత్యనారాయణలను నామినేట్ చేసింది. దీంతో కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ నియామకంపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఆ స్థానాల భర్తీ పెండింగ్‌లో పడిపోయింది.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహమ్మద్ అజారుద్దీన్‌, కోదండరాం పేర్లను రాష్ట్ర గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అయితే వీరి నియామకాన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నియామకాలపై మళ్లీ స్టే పడింది. అయితే మహమ్మద్ అజారుద్దీన్ కేబినెట్‌లో కొనసాగుతుండటంతో ఎమ్మెల్సీ అవ్వడం తప్పనిసరి. ఏప్రిల్ 30లోగా చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది.ఈ క్రమంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌తో సంప్రదింపులు జరపవచ్చు అని సుప్రీంకోర్టు సూచించింది. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏప్రిల్ 19న గవర్నర్‌ శివ ప్రతాప్ శుక్లాను కలిసి నియామకాలకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు.ఈ క్రమంలో ఈ నియామకాలకు మార్గం సుగమమైంది. ఎమ్మెల్సీలకు లైన్ క్లియర్ ఇకపోతే తెలంగాణ మంత్రి అజారుద్దీన్, తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం ఎమ్మెల్సీ‌ అభ్యర్థిత్వాలకు లైన్ క్లియర్ అయింది. తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీల అంశంపై చాలా కాలంగా వివాదం కొనసాగుతుంది. ఈ అంశం వివిధ ములుపులు తిరిగిన సంగతి తెలిసిందే. అయితే గతేడాది ఆగస్టులో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, జర్నలిస్ట్ అమీర్ అలీఖాన్‌ల నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ కోటాలో అజారుద్దీన్‌, ప్రొఫెసర్‌ కోదండరాం‌ పేర్లను గవర్నర్‌కు సిఫార్సు చేసింది. అప్పటి నుంచి ఆ ఫైల్ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *