జనం న్యూస్ : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికులు చేసిన కృషి మరువలేనిదని గుర్తు చేసిన తలసాని.. ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి.. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించి.. వారి డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించిందని గుర్తు చేశారు. పలు పార్టీలు ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలపగా.. ఆ పార్టీ నేతలు.. కార్మికులతో కలిసి ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ .. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆర్టీసీ సమ్మెలో భాగంగా సికింద్రాబాద్ పరిధిలోని రాణిగంజ్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో కలిసి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధర్నాలో పాల్గొన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం గతంలో కేసీఆర్ సకల జనులను ఏకం చేశారని.. అందులో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తు చేశారు. తెలంగాణ సాధనలో ఆర్టీసీ కార్మికుల మర్చిపోలేని కృషి చేశారని పేర్కొన్నారు. ఆ విషయం ప్రస్తుత సర్కార్ గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అవసరమైతే సర్కార్‌ను కూల్చే శక్తి కూడా ఆర్టీసీ కార్మికులకు ఉందని తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. కేసీఆర్ నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయం తీసుకున్నట్లు గుర్చు చేసిన తలసాని.. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం మారిపోయి.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని తెలిపారు. ఆర్టీసీ ఎంతో ప్రాధాన్యం కలిగిన సంస్థ అని పేర్కొన్న తలసాని.. గత 2 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడం వల్ల రాష్ట్రంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల వెనక ప్రతిపక్ష నేతలు ఉండి సమ్మె చేయిస్తున్నారని ఒక మంత్రి ఆరోపణలు చేస్తున్నారని తెలిపిన తలసాని.. ఇచ్చిన హామీలను ప్రభుత్వం తీరిస్తే అసలు కార్మికులు సమ్మె చేయాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. సమ్మె చేసే కార్మికులను ఆర్టీసీ ఎండీ బెదిరింపులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికులతో కలిసి వెళ్లి సచివాలయాన్ని ముట్టడిస్తామని.. ప్రభుత్వం మెడలు వంచి వారికి ఇచ్చిన హామీలను సాధిద్దామని తలసాని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఎలక్ట్రిక్ బస్సులకు ప్రైవేటు డ్రైవర్లను నియమించి నడిపిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ బస్సులు నడిపిన డ్రైవర్లకు ఎలక్ట్రిక్ బస్సు నడపడం రాదా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ధైర్యంగా పోరాటం చేయాలని ఆర్టీసీ కార్మికులకు సూచించిన తలసాని.. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉందని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా రాష్ట్ర కేబినెట్ సమావేశం పూర్తి అయిన వెంటనే ఆర్టీసీ జేఏసీని చర్చలకు పిలవాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీల విషయంలో పూర్తి క్లారిటీ ఇవ్వాలని పేర్కొన్నారు. ప్రభుత్వం తూతూ మంత్రంగా చెప్పే హామీలను ఒప్పుకోవద్దని ఆర్టీసీ జేఏసీ సంఘాల నేతలకు సూచించారు. ఆర్టీసీ కార్మికులు లేవనెత్తిన 29 డిమాండ్లను తీర్చేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం అంటోందని.. అయితే ఆ 29 డిమాండ్లు ఏంటి అనేది మీడియా సాక్షిగా విడుదల చేయాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్లను ఆమోదించాలని.. తక్షణమే సమ్మెను విరమించేలా చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించడం పోయి.. కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చి వారికి ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. వారికి తగిన శిక్షణ ఇచ్చి ఎలక్ర్టిక్ బస్సులకు డ్రైవర్లుగా నియమించాలని సూచించారు. ఆర్టీసీ సమ్మె కారణంగా రాష్ట్రంలోని విద్యార్థులు, వ్యాపారులు, ప్రజలు.. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అయితే, అంతకు ముందు ఈ నౌకపై కాల్పులు జరిపి, గ్రనేడ్లు విసిరారు. దీంతో నౌకలోని సెంట్రల్ కమాండ్ సెంటర్ దెబ్బతింది. అయితే, సిబ్బందికి ఎటువంటి గాయాలు కాలేదు. వారు క్షేమంగానే ఉన్నారు. ఈ పరిణామం ఇరాన్, భారత్ మధ్య సంబంధాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీనికి రెండు రోజుల ముందు కూడా భారత్ జెండా ఉన్న నౌకపై ఇరాన్ కాల్పులు జరిపింది. దీనిపై తీవ్రంగా స్పందించిన భారత్.. న్యూఢిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది. ఇక, ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం నిరవధికంగా పొడిగిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే భారత్‌కు వస్తున్న నౌక సహా రెండు ట్యాంకర్లను ఇరాన్ స్వాధీనం చేసుకుంది. అయితే, ఇరాన్ జలాల్లో మాత్రం అమెరికా దిగ్బంధనం కొనసాగుతోంది.