హర్మూజ్ జలసంధిలో భారత నావికులు చిక్కుకుపోయారు

* హర్మూజ్ వద్ద భారత నావికుల పరిస్థితి ఉద్వేగభరితం

* బయటకు రావొద్దని డీజీ షిప్పింగ్ హెచ్చరిక! * భారత నావికులకు కీలక ఆదేశాలు జారీ

పయనించే సూర్యుడు న్యూస్ : హర్మూజ్‌ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్రం కీలక విజ్ఞప్తి చేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా నౌకల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్ ఒక ప్రకటన విడుదలచేసింది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది.ఇంతలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటనను విడుదల చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల ఇరాన్, దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. నౌకల నుంచి బయటకు రావద్దు హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని…అనవసరంగా నౌకల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ షిప్పింగ్ ఒక ప్రకటన విడుదలచేసింది. భద్రతాకారణాల దృష్ట్యా ఇరాన్‌ దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన భారత నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించింది. మరోవైపు భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని డీజీఎస్ ఆదేశించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నౌకలలో ఉన్న వారు అందులోనే ఉండాలని కేంద్రప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ఆదేశించింది.అధికారులు, కంపెనీ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని పంచుకోవాలని సూచించింది. ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి కారణంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. స్వాగతించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడాన్ని భారత్ స్వాగతించింది. పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లపై తీవ్ర ప్రభావం చూపించాయని భారత్ వెల్లడించింది. యుద్ధ విరమణ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 90 నిమిషాల ముందు ట్రంప్ యూటర్న్ ఇకపోతే హర్మూజ్ జలసంధిపై అమెరికా ఇరాన్‌కు 48 గంటలు గడువు విధించిన సంగతి తెలిసిందే. గడువు ముగిసిన తర్వాత ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. ఇరాన్‌పై సైనిక దాడికి గడువు మరో 90 నిమిషాల్లో ముగుస్తుండగా ట్రంప్ ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. తెరవెనుక పాకిస్థాన్ సాగించిన దౌత్యం ఫలితంగానే ఈ ‘ద్వైపాక్షిక కాల్పుల విరమణ’ సాధ్యమైందని ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో వెల్లడించారు. రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఉంటుందని అయితే ఇందుకు ప్రతిగా ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తక్షణమే తెరవాలని ట్రంప్ కండీషన్ పెట్టారు.‘మా సైనిక లక్ష్యాలు ఇప్పటికే నెరవేరాయి. ఇరాన్‌తో దీర్ఘకాలిక శాంతి కోసం ఇది ఒక ముందడుగు’అని ట్రంప్ అభివర్ణించారు. కాల్పుల విరమణ ప్రకటించిన ఇరాన్ అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఇరాన్‌పై గత 39 రోజులుగా భీకర యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ భీకర యుద్ధానికి అటు అమెరికా ఇటు ఇరాన్ తాత్కాలికంగా విరామం ప్రకటించింది. రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ అంగీకరించాయి. ఈ మేరకు తమ సైనిక విభాగాలన్నీ కాల్పులు నిలిపివేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్‌పై సైనిక దాడికి తాను నిర్దేశించుకున్న గడువుకు సరిగ్గా 90 నిమిషాల ముందు ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. రెండు వారాలపాటు కాల్పుల విరమణకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు.ట్రంప్ ప్రతిపాదనను సైతం ఇరాన్ అంగీకరించింది. ఇలా ఇరుదేశాలు తీసుకున్న నిర్ణయంతో పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు తొలగిపోయినట్లు అయ్యింది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *