అక్షర ఆయుధం ; హర్మూజ్ జలసంధిలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్రం కీలక విజ్ఞప్తి చేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా నౌకల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటన విడుదలచేసింది. ఇరాన్, అమెరికా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మొదట ఇరాన్ హర్మూజ్ జలసంధిని తెరిచింది.ఇంతలో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. దీంతో హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ క్రమంలో జలసంధిని దాటేందుకు వచ్చిన నౌకలు తిరుగుముఖం పట్టాయి. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటనను విడుదల చేసింది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో భద్రతా కారణాల వల్ల ఇరాన్, దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచించింది. నౌకల నుంచి బయటకు రావద్దు హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని…అనవసరంగా నౌకల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఒక ప్రకటన విడుదలచేసింది. భద్రతాకారణాల దృష్ట్యా ఇరాన్ దాని పరిసర జలాల్లో చిక్కుకుపోయిన భారత నావికులు సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని పేర్కొంది.అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని సూచించింది. మరోవైపు భారత రాయబార కార్యాలయంతో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉండాలని డీజీఎస్ ఆదేశించింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి నౌకలలో ఉన్న వారు అందులోనే ఉండాలని కేంద్రప్రభుత్వం కీలక అడ్వైజరీ జారీ చేసింది. అధికారులు జారీ చేసే సూచనలను పాటించాలని ఆదేశించింది.అధికారులు, కంపెనీ ప్రతినిధులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ పరిస్థితిని పంచుకోవాలని సూచించింది. ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణకు ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. అయితే లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి కారణంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. స్వాగతించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడాన్ని భారత్ స్వాగతించింది. పశ్చిమాసియాలోని ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరా, వాణిజ్య నెట్‌వర్క్‌లపై తీవ్ర ప్రభావం చూపించాయని భారత్ వెల్లడించింది. యుద్ధ విరమణ నేపథ్యంలో హర్మూజ్ జలసంధి గుండా నౌకాయానం స్వేచ్ఛగా కొనసాగుతుందని ఆశిస్తున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా ప్రకటించింది. 90 నిమిషాల ముందు ట్రంప్ యూటర్న్ ఇకపోతే హర్మూజ్ జలసంధిపై అమెరికా ఇరాన్‌కు 48 గంటలు గడువు విధించిన సంగతి తెలిసిందే. గడువు ముగిసిన తర్వాత ఇరాన్‌ను నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే అకస్మాత్తుగా ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు.